ఈ నైపుణ్యం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. వారెన్‌ బఫెట్‌ చెప్పిన సూత్రమిదే

Warren Buffett: యువ నిపుణుల కోసం ఓ సలహా ఇచ్చారు అమెరికన్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌. ఈ నైపుణ్యం మీ సంపాదనపై ప్రభావం చూపుతుందన్నారు.

Updated : 13 Jun 2024 10:01 IST

Warren Buffett | ఇంటర్నెట్‌డెస్క్‌: యువతకు సలహాలు, కెరియర్‌కు ఉపయోగపడే సూచనలు అందించడంలో వ్యాపారవేత్తలు, కంపెనీ సీఈఓలు ఎప్పుడూ ముందుంటారు. తమ జీవితంలో ఎదురైన అనుభవాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటుంటారు. అలా ఈ ఒక్క స్కిల్‌ మీ సంపాదనపై ప్రభావం చూపుతుందంటున్నారు ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ (Warren Buffett).

యువత తమ సంపాదనను పెంచుకోవాలంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శ్రద్ధ పెట్టాలని సూచించారు బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, సీఈఓ బఫెట్‌. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితాన్ని మార్చేసిన ఈ నైపుణ్యం గురించి మాట్లాడారు. ‘‘20 ఏళ్ల వయసు వరకు నేను బహిరంగంగానే మాట్లాడలేదు. ఆ విషయమే నన్ను శారీరకంగా కుంగతీసింది. ఆ భయంతోనే క్లాస్‌లో అందరి ముందు మాట్లాడేందుకు అవకాశం లేని కోర్సులనే ఎంచుకున్నాను. ఒక వేళ మాట్లాడాల్సి వస్తే నా పేరు కూడా చెప్పేవాడిని కాదు’’ అని బఫెట్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో షావోమీ కొత్త మొబైల్‌.. ధర ఎంతంటే?

అలా కొలంబియా బిజినెస్‌ స్కూల్‌ నుంచి పట్టభద్రుడయ్యాక తిరిగి స్వస్థలానికి వెళ్లారట. అక్కడ పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్స్‌ 100 డాలర్లు అంటూ ఓ ప్రకటన చూశారు. తనలోని భయాన్ని పోగొట్టుకొనేందుకు ఇదే సరైన అవకాశంగా భావించారట. అంతే వెంటనే కోర్సు పూర్తి చేసేశారు. తన నైపుణ్యాలు పదునుపెట్టేందుకు ఒమాహా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ‘‘ఒకవేళ ఇప్పటికీ అందరి ముందు మాట్లాడటం నేర్చుకోకపోయి ఉంటే నా పరిస్థితి వేరేలా ఉండేది. అందుకే వెంటనే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకున్నాను. ఈ కోర్సు నా జీవితంపై చాలా ప్రభావం చూపింది’’ అని బఫెట్‌ అన్నారు. ఈ నైపుణ్యం చాలా ముఖ్యం, దీనిపైనే భవిష్యత్‌ సంపాదన ఆధారపడుతుందని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని