IPO: ఈ వారం ఐపీఓల సందడే సందడి

ఈ వారం ఐపీఓల సందడే సందడిదిల్లీ: ఈ వారం ప్రాథమిక మార్కెట్‌లో సందడి నెలకొంది. ప్రధాన కంపెనీలతో పాటు ఎస్‌ఎంఈ విభాగంలో 10 సంస్థలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.1991 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి.

Updated : 24 Jun 2024 07:25 IST

దిల్లీ: ఈ వారం ప్రాథమిక మార్కెట్‌లో సందడి నెలకొంది. ప్రధాన కంపెనీలతో పాటు ఎస్‌ఎంఈ విభాగంలో 10 సంస్థలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.1991 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. మరో 11 కంపెనీలు, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేయనున్నాయి.

  • అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌: ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ తయారీ సంస్థ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓ జూన్‌ 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.267- 281 నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా రూ.1000 కోట్ల తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో   రూ.500 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. 
  • వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌: చత్తీస్‌గఢ్‌ కేంద్రంగా స్పాంజ్‌ ఐరన్, ఎంఎస్‌ బిల్లెట్స్, టీఎంటీ బార్స్‌ తయారుచేసే వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.195- 207 నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 72 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఎస్‌ఎంఈ విభాగంలో శివాలిక్‌ పవర్‌ కంట్రోల్, సిల్వాన్‌ ప్లైబోర్డ్, మాసన్‌ ఇన్‌ఫ్రాటెక్, విశామన్‌ గ్లోబల్‌ సేల్స్, ది మనీ ఫెయిర్‌ (అకికో గ్లోబల్‌ సర్వీసెస్‌), డివైన్‌ పవర్, పెట్రో కార్బన్‌ అండ్‌ కెమికల్స్, డైన్‌స్టెన్‌ టెక్‌ ఐపీఓల ద్వారా నిధులు సమీకరించనున్నాయి. 
  • ప్రధాన విభాగంలో స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఆఫర్‌ 25న ముగియనుంది. ఎస్‌ఎంఈ విభాగంలో ఎన్‌న్యూట్రికా, విన్నీ ఇమ్మిగ్రేషన్‌ ఐపీఓలు 24న, మెడికామెన్‌ ఆర్గానిక్స్‌ ఐపీఓ 25న ముగియనున్నాయి. 
  • ఇటీవల ఐపీఓ ముగించుకున్న డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్, ఆక్మే ఫిన్‌ట్రేడ్‌ ఇండియాలు ఈ నెల 26న సూచీల్లో నమోదుకానున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని