ముందుగానే అంచ‌నా వేయాల్సిన‌ మూడు న‌ష్ట‌భ‌యాలు

స‌రాస‌రి వ‌య‌సు కంటే ఎక్కువ కాలం జీవించి ఉండ‌టాన్నే ఆర్థిక ప‌రిభాష‌లో లాంగ్విటీ రిస్క్అంటారు.

Published : 22 Dec 2020 15:25 IST

కొన్ని న‌ష్ట‌భ‌యాల‌ను త‌గ్గించేందుకు స‌రిప‌డ పెట్టుబ‌డి సాధ‌నాలు మ‌న‌కు అందుబాటులో లేవ‌నే చెప్పాలి. వాటికి అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మూ, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మూ చేయాలి. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత జీవించేందుకు స‌రిప‌డ నిధిని స‌మ‌కూర్చుకునేందుకు మ‌దుప‌ర్లు ముందు నుంచే కొన్ని న‌ష్ట‌భ‌యాల‌ను అంచ‌నా వేయాలి. అలాంటి మూడు ర‌కాల న‌ష్ట‌భ‌యాల‌ను ఇప్ప‌డు చూద్దాం

లాంగ్విటీ రిస్క్:

ఆర్థిక ప‌రిభాష‌లో లాంగ్విటీ రిస్క్ అంటే ఎక్కువ కాలం జీవించి ఉండ‌టం వ‌ల్ల క‌లిగే న‌ష్టం. స‌రాస‌రి వ‌య‌సు కంటే ఎక్కువ కాలం జీవించి ఉండ‌టానికి న‌ష్టభ‌యానికి ఉన్న ఆర్థిక బంధం ఏంట‌నుకుంటున్నారా? ఉదాహ‌ర‌ణ‌కు X, Y అనే భార్య‌భ‌ర్త‌లు వ‌య‌సు 60 సంత్స‌రాల‌కు ప‌ద‌వీవిర‌మ‌ణ చేసి అనంత‌రం జీవించేందుకు స‌రిప‌డ ప‌ద‌వీవిర‌మ‌ణనిధిని స‌మ‌కూర్చుకున్నార‌ని అనుకుందాం. ప్ర‌స్తుతం అంచ‌నా ప్ర‌కారం భార్య 80, భ‌ర్త 83 సంవ‌త్స‌రాలు జీవించి ఉంటార‌ని వారు అంచ‌నావేశారు. అంటే ప‌ద‌వీవిర‌మ‌ణ అనంత‌రం 23 సంవ‌త్స‌రాల పాటు జీవించేందుకు యాన్యూటీని తీసుకోవాల‌నుకుంటున్నారు. అయితే లాంగిటివిటీ రిస్క్ ద్వారా వారు 80, 83 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాలం జీవిస్తే ఆ కాలానికి డ‌బ్బు అవ‌సరం ఉంటుంది.

సంభావ్య‌త చూస్తే, X, Y, X లేదా Y లు 95 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ‌తికి ఉండేందుకు సంభావ్య‌త వ‌రుస‌గా 5%, 10 %,14 % అంచ‌నా వేసుకున్నారు. 35 సంవ‌త్స‌రాల‌పాటు త‌మ రిటైర్ మెంట్ నిధిని స‌ర్దుకోవాల్సి ఉంటుంది. అంటే ప్ర‌ణాళిక వేసేట‌పుడు అంచ‌నా వేసిన వ‌య‌సు కంటే ఎక్కువ కాలం జీవించి ఉంటారు. కాబ‌ట్టి ఆ కాలానికి స‌రిప‌డ మొత్తం ప్ర‌తీ నెలా అవ‌స‌ర‌ముంటుంది.

ఈ లాంగిటివిటీ రిస్క్ ను త‌గ్గించే పెట్టుబ‌డి సాధ‌నం లైఫ్ టైం యాన్యూటీ. దీని ద్వారా పాల‌సీదారులు జీవించి ఉన్నంత కాలం యాన్యూటీ మొత్తాన్ని అందుకోవ‌చ్చు మ‌న దేశంలో యాన్యూటీ పాల‌సీలు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని స‌రిపోయే విధంగా యాన్యూటీ అందించ‌డంలేదు. వీటితో అధిక ప‌న్ను శ్లాబులో ఉన్న పింఛ‌న్ దారుల‌కు ప‌న్ను మిన‌హాయింపు కూడా అంత ఆక‌ర్ష‌ణీయంగా లేదు.

తీవ్ర అనారోగ్యం, అంగ‌వైక‌ల్యం:

తీవ్ర అనారోగ్యం, అంగ‌వైక‌ల్యం క‌ల‌గ‌డం ద్వారా న‌ష్టం ఏర్ప‌డొచ్చు. జీవిత బీమా ట‌ర్మ్ పాల‌సీలో పాల‌సీదారుడు అకాల మ‌ర‌ణం నుంచి కుటుంబాన్ని కాపాడుతుంది. కానీ తీవ్ర‌మైన అనారోగ్యాల‌కు, ప్ర‌మాదాలు జ‌రిగితే జీవిత బీమా పాల‌సీలు ప‌నిచేయ‌వు. చాలా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీలు అయితే త‌క్కువ బీమా హామీ మొత్తానికి ఉండ‌ట‌మో లేదా కొన్ని ప్ర‌త్యేక‌మైన వ్యాధుల‌కు మాత్ర‌మే వ‌ర్తించేలానో ఉంటున్నాయి.కొన్ని ర‌కాల ప‌రిమితులు ఉంటాయి. ఆ ప‌రిమితులు లోబ‌డి ఉంటే నే బీమా ప‌రిధిలోకి వ‌స్తాయి. లేదంటే లేదు. వాటికి ప్రీమియం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. దీనికి ప‌రిష్కారం కెరీర్ ప్రారంభం నుంచే పొదుపు చేయ‌డం ప్రారంభించ‌డం, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లాంటివి మాత్ర‌మే చేయాలి.

ద్ర‌వ్యోల్బ‌ణం ద్వారా వ‌చ్చే న‌ష్టం:

ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి మ‌దుప‌ర్లు దాచుకున్న డ‌బ్బు పై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ఉండొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 10 ఏళ్ల ప్ర‌భుత్వ బాండ్లలో చేసే పెట్టుబ‌డి ప‌దేళ్ల త‌రువాత ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో త‌క్కువ రాబ‌డి కావొచ్చు.యూఎస్ లో ఇది చాలా త‌క్కువ న‌ష్ట‌భ‌యాన్ని క‌లిగి ఉంటుంది. ఎందుకంటే ట్రెజ‌రీ ఇన్ఫ్లేష‌న్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్ (టిప్స్) అందుబాటులో ఉంటాయి. మ‌న దేశంలో చాలా త‌క్కువ మొత్తంలో సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప‌న్ను ప‌రంగా కూడా ఆక‌ర్ష‌ణీయం కాదు.

కాబ‌ట్టి మ‌దుర్లు ఈక్విటీ , డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు, స్థిరాస్తి, ఇండెక్స్ ఫండ్లు ఇలా వేర్వేరు పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఒక దానితో క‌లిగే న‌ష్ట‌భ‌యాన్ని మ‌రొక పెట్టుబ‌డి సాధ‌నంతో త‌గ్గించుకుంటూ మ‌దుపు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని