Tecno Camon: 5000mAh బ్యాటరీ, 64MP కెమెరాతో టెక్నో క్యామాన్‌లో మరో 3 ఫోన్లు!

Tecno Camon: టెక్నో క్యామాన్‌ 20, క్యామాన్‌ 20 ప్రో 5జీ, క్యామాన్‌ 20 ప్రీమియర్‌ 5జీ పేరిట వస్తున్న ఈ మూడు మొబైళ్లలో మీడియా టెక్‌ ప్రాసెసర్‌ ఉంది.

Published : 29 May 2023 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నో మొబైల్స్‌ క్యామాన్‌ సిరీస్‌ (Tecno Camon Series)లో మరో మూడు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. టెక్నో క్యామాన్‌ 20 (Tecno Camon 20), క్యామాన్‌ 20 ప్రో 5జీ (Camon 20 Pro 5G), క్యామాన్‌ 20 ప్రీమియర్‌ 5జీ (Camon 20 Premier 5G) పేరిట వస్తున్న ఈ మూడు మొబైళ్లలో మీడియా టెక్‌ ప్రాసెసర్‌ ఉంది. అమోలెడ్‌ తెరలను పొందుపర్చారు. ఇతర ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

టెక్నో క్యామాన్‌ 20, 20 ప్రో 5జీ ధర..

టెక్నో క్యామాన్‌ 20 (Tecno Camon 20) ధర భారత్‌లో రూ.14,999. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. గ్లేషియర్‌ గ్లో, ప్రీడాన్‌ బ్లాక్, సెరినిటీ బ్లూ రంగుల్లో లభిస్తుంది. మరోవైపు టెక్నో క్యామాన్‌ 20 ప్రో 5జీ(Camon 20 Pro 5G)లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 8GB + 128GB ధర రూ.19,999. 8GB + 256GB ధర రూ.21,999. ఈ రెండు ఫోన్లు జూన్‌ రెండో వారం నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నాయి. టెక్నో క్యామాన్‌ 20 ప్రీమియర్‌ జూన్‌ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ధర సహా ఇతర వివరాలను వెల్లడించలేదు.

టెక్నో క్యామాన్‌ 20, 20 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు..

టెక్నో క్యామాన్‌ 20 (Tecno Camon 20), టెక్నో క్యామాన్‌ 20 ప్రో (Camon 20 Pro 5G) ఫీచర్లు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. రెండింటిలోనూ 6.67 అంగుళాల హెచ్‌డీ+ అమోలెడ్‌ స్క్రీన్‌ ఉంది. అయితే, ప్రో మోడల్‌లో రీఫ్రెష్‌ రేట్‌ 120Hzగా ఇస్తున్నారు. రెండూ ఆండ్రాయిడ్‌ ఆధారిత HiOS 13.0 out of the box ఓఎస్‌తో వస్తున్నాయి. క్యామాన్‌ 20లో 12nm మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. అదే ప్రో మోడల్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో వస్తోంది.

టెక్నో క్యామాన్‌ 20 (Tecno Camon 20)తో పాటు 20ప్రో (Camon 20 Pro 5G)లోనూ 64ఎంపీ ప్రైమరీ కెమెరా వస్తోంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ముందు భాగంలో ఏర్పాటు చేశారు. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ, వైఫై, బ్లూటూత్‌ 5, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉన్నాయి. క్యామాన్‌ 20 ప్రో మాత్రం 5జీని కూడా సపోర్ట్‌ చేస్తుంది. యాక్సెలరోమీటర్‌, ఇ-కంపాస్‌, యాంబియెంట్‌ లైట్‌ వంటి సెన్సర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ 5,000mAh బ్యాటరీలను అమర్చారు. క్యామాన్‌ 20ని 18వాట్‌ చార్జర్‌తో ఇస్తున్నారు.

టెక్నో క్యామాన్‌ 20 ప్రీమియర్‌ 5జీ స్పెసిఫికేషన్లు..

క్యామాన్‌ 20 ప్రీమియర్‌ 5జీ (Tecno Camon 20 Premier 5G) ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌ ఉంది. 6.67 అంగుళాల హెచ్‌డీ+ అమోలెడ్‌ స్కీన్‌ను ఇస్తున్నారు. రీఫ్రెష్‌ రేట్‌ 120Hzగా ఉంది. 8GB ర్యామ్‌ 512GB స్టోరేజ్‌తో వస్తోంది. 50 ఎంపీ ప్రైమరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 45 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని