- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ITR e-verification: ఐటీఆర్ ఇ-వెరిఫై వెంటనే పూర్తి చేయండి.. ఎందుకంటే?
ఈనాడు, హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, ఇ-వెరిఫై (ITR e-verification) చేయలేదా.. అయితే, వెంటనే ఆ పనిని పూర్తి చేయండి. ఆగస్టు 1 నుంచి ఈ గడువును 30 రోజులకు తగ్గిస్తూ ఆదాయపు పన్ను విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ గడువు 120 రోజులుగా ఉంది. ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశాక, వెంటనే ఇ-వెరిఫై చేయాల్సి (ITR e-verification) ఉంటుంది. సాధారణంగా ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ ఈవీసీ, డిజిటల్ సంతకం తదితర మార్గాల్లో ఇ-వెరిఫై చేయొచ్చు. లేదా ఫారం-5లో సంతకం చేసి, సీపీసీ, బెంగళూరుకు పోస్టులో పంపించే అవకాశమూ ఉంది. ఇ-వెరిఫై లేదా ఫారం-5ను సీపీసీకి పంపించకపోతే.. రిటర్నులు దాఖలు చేసినా.. అవి అధీకృతం కావు. గడువు దాటితే ఆ రిటర్నులను తిరస్కరించే ఆస్కారమూ ఉంది.
ఇకపై రిటర్నులు సమర్పించిన నాటి నుంచి 30 రోజుల్లోగా ఇ-వెరిపై చేయాలి. లేదా సంతకం చేసిన ఫారం-5ను సీపీసీ, బెంగళూరుకు పంపించాల్సి ఉంటుంది. లేకపోతే రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేసినట్లు పరిగణిస్తామని ఆదాయపు పన్ను విభాగం జులై 29 తేదీతో ఇచ్చిన నోటిఫికేషన్లో వెల్లడించింది. స్పీడ్ పోస్టులో పంపించినప్పుడు.. ఏ తేదీన పంపించారో చూస్తామని ఐటీ విభాగం పేర్కొంది. రిటర్నుల దాఖలు చేసిన 30 రోజుల తర్వాత పంపిన వాటిని ఆలస్యంగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: డిసెంబరు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం..మరి లేట్ ఫీజు ఎంతో తెలుసా?
ఆధార్ ఓటీపీ ద్వారా...
- www.incometax.gov.in లింక్‌పై క్లిక్ చేసి మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి
- ‘ఇ-ఫైల్’ ట్యాబ్ కింద, ‘Income Tax Returns’పై క్లిక్ చేయండి
- ‘ఇ-వెరిఫై రిటర్న్స్’పై క్లిక్ చేయండి
- ఇప్పుడు ‘ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్లో OTPని ఉపయోగించి ఇ-వెరిఫై చేయాలనుకుంటున్నాను’ అని ఉన్న ఆప్షన్‌ను ఎంచుకోండి.
- స్క్రీన్‌పై కనిపించే విండోలో, ‘నేను నా ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి అంగీకరిస్తున్నాను’పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ‘జనరేట్ ఆధార్ OTP’ బటన్‌పై క్లిక్ చేయండి
- మీరు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది
- ఇచ్చిన బాక్స్‌లో OTPని నమోదు చేసి, ‘సబ్మిట్’పై క్లిక్ చేయండి
నెట్ బ్యాంకింగ్ ద్వారా...
- www.incometax.gov.in లింక్‌పై క్లిక్ చేసి మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి
- ‘ఇ-ఫైల్’ ట్యాబ్ కింద, ‘Income Tax Returns’పై క్లిక్ చేయండి
- ‘ఇ-వెరిఫై రిటర్న్స్’పై క్లిక్ చేయండి
- ఇప్పుడు ‘త్రూ నెట్ బ్యాంకింగ్’ ఎంచుకుని, ‘కంటిన్యూ’పై క్లిక్ చేయండి
- ఇప్పుడు, మీరు ITRని ధ్రువీకరించాలనుకుంటున్న బ్యాంకును ఎంచుకుని, ‘కంటిన్యూ’పై క్లిక్ చేయండి. మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పేజీకి వెళతారు
- ‘మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ నుండి ఈ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి’ అని ఉండే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- ఇప్పుడు, మీరు ITR పోర్టల్‌కి వెళతారు
- మీ ITR ఫారంలో 'e-verify'పై క్లిక్ చేయండి
- మీ ITR ధ్రువీకరణ ప్రక్రియ పూర్తవుతుంది
ఆఫ్‌లైన్ మార్గంలో...
- ITR వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ITR ధ్రువీకరణ పత్రాన్ని ప్రింట్ తీసుకోండి
- ఇప్పుడు ఫారంపై సంతకం చేసి కొరియర్ రూపంలో ప్యాక్ చేయండి
- కొరియర్‌ను సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC), ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు (560500)కి పంపండి
- అది అందిన వెంటనే సీపీసీ దాన్ని ధ్రువీకరిస్తుంది
- మీకు, ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందుతుంది
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Fake Police Station: ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహణ.. బిహార్‌లో ఓ ముఠా దుశ్చర్య!
-
General News
Dengue: మీ పిల్లలకు డెంగీ జ్వరమా..? ఆందోళన అసలే వద్దు..!
-
World News
Zaporizhzhia: అలాగైతే ఆ ప్లాంట్‌ను మూసివేస్తాం.. రష్యా హెచ్చరిక!
-
Movies News
Viruman: సూర్య, కార్తిలకు డైమండ్ బ్రాస్లెట్, గోల్డ్ చైన్లు...
-
India News
Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
-
Movies News
Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు