SBI Report: బ్యాంకుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఇదే సరైన సమయం: ఎస్‌బీఐ నివేదిక

SBI Report: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే సరైన సమయం అని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

Published : 08 Jul 2024 18:15 IST

SBI Report | దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే సరైన సమయమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ మంచి స్థితిలో ఉన్న వేళ ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది అనుకూలమని తెలిపింది. ఈ మేరకు ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25కు ముందుమాట’ పేరుతో ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది.

ఐడీబీఐలో ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి 61 శాతం వాటాను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎస్‌బీఐ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. 2022లో ఐడీబీఐ విక్రయానికి బిడ్లు ఆహ్వానించారని, 2023 జనవరిలో వాటాల కొనుగోలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను దీపమ్‌ అందుకుందని పేర్కొంది. ఈ బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగే డిపాజిట్లపై లభించే వడ్డీపై పన్నుతో పాటు, మ్యూచువల్‌ ఫండ్‌, ఈక్విటీ మార్కెట్‌ తరహాలోనే వీటిపైనా పన్ను విధానం ఉండాలని అభిప్రాయపడింది.

50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో సీఎంఎఫ్‌ తొలి ఫోన్‌

2022-23 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు 5.3 శాతంగా ఉందని, 2024లో 5.4 శాతానికి చేరొచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ తరహాలో డిపాజిట్‌ రేట్లు ఉంటే ఆ మేర పొదుపు పెరగడంతో పాటు కాసా డిపాజిట్లూ పెరుగుతాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. దీనివల్ల డిపాజిట్ల బేస్‌ పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థలోనూ స్థిరత్వం వస్తుందని అభిప్రాయపడింది. దివాలా స్మృతిలోనూ కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడింది. ఈ నివేదికలో వ్యక్తపరిచిన అభిప్రాయాల రీసెర్చ్ టీమ్‌కు సంబంధించినవని, ఎస్‌బీఐకి గానీ, దాని అనుబంధ సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని