రుణం వాయిదాలు ఆలస్యమైతే...
వందల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయన్న వార్తల నేపథ్యంలో చాలామంది తమ అప్పుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు.
తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నన్ని రోజులూ ఇబ్బందేమీ ఉండదు. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మారాల్సి వచ్చినా, మానేసినా ఆదాయం ఆగి వాయిదాలు చెల్లించడం భారం కావచ్చు. ఇలాంటప్పుడు తాత్కాలికంగా బకాయి పేరుకుపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రుణ గ్రహీతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలి?
వందల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయన్న వార్తల నేపథ్యంలో చాలామంది తమ అప్పుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. గృహరుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం, కార్డు బిల్లులు ఇలా ఏదో ఒక రుణం లేని వారుండరు. దీంతో జీతం రాకపోతే ఈఎంఐలు ఎలా చెల్లించాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురై వాయిదాలు చెల్లించనప్పుడు సాధారణంగా బ్యాంకులు ఆ రుణగ్రహీతపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది తెలుసుకోవాలి.
మొండి బాకీగా..
ఏదైనా రుణానికి వరుసగా మూడు నెలలపాటు వాయిదాలను చెల్లించకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆ బాకీని తాత్కాలిక మొండి బకాయిగా భావిస్తాయి. రుణగ్రహీతకు నోటీసులు పంపిస్తాయి. వాయిదాలు ఆలస్యమైనప్పుడు బ్యాంకులు వాయిదా మొత్తానికి 1 నుంచి 2 శాతం వరకూ అపరాధ రుసుమును విధిస్తాయి. 6 నెలల వరకూ ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు దాన్ని పూర్తిస్థాయి మొండి బకాయి (ఎన్పీఏ)గా నిర్ణయిస్తాయి. రుణం ఎన్పీఏగా మారినప్పుడే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తాయి. ఇప్పుడు కొన్ని ఆర్థిక సంస్థలు తమ ఎన్పీఏలను థర్డ్‌పార్టీకి అప్పగిస్తున్నాయి.
క్రెడిట్ స్కోరుపై..
వాయిదాలను సరిగా చెల్లించకపోతే.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. తరచూ ఈఎంఐలు జమ కాకపోతే క్రెడిట్ స్కోరు కనీస స్థాయికి పడిపోయే ఆస్కారమూ ఉంది. ప్రస్తుతం బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపోకు అనుసంధానం చేశాయి. దీంతోపాటు రుణగ్రహీత క్రెడిట్ స్కోరు ఆధారంగా వడ్డీని నిర్ణయిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే.. వడ్డీ రేటు పెరిగే ఆస్కారం ఉంది. మేజర్ డిఫాల్ట్ సందర్భంలో బ్యాంకులు ఎన్పీఏగా చూపిస్తే.. రుణం తీసుకున్న వ్యక్తి విశ్వసనీయత దెబ్బతింటుంది.
పరిష్కారం ఏమిటి?
తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురై.. వాయిదాలను చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. పరిస్థితులు సర్దుకున్నాక ఈ బాకీలన్నీ వెంటనే తీర్చేయాలి. ఒకవేళ మీకు ఆర్థిక అనిశ్చితి అధికంగా ఉన్నట్లు అనిపిస్తే.. ముందుగా తక్కువ వడ్డీ వస్తున్న పెట్టుబడి పథకాలను వెనక్కి తీసుకోండి. తాత్కాలికంగా బంగారం హామీగా రుణం తీసుకోవచ్చు. లేదా మిత్రులు, బంధువుల దగ్గర చేబదులు తీసుకునే వెసులుబాటునూ పరిశీలించవచ్చు.
* లోన్ ఇన్సూరెన్స్ పాలసీల్లాంటివి కొన్నాళ్లపాటు ఈఎంఐ చెల్లించకపోతే ఆదుకుంటాయి. ఇలాంటివాటిని ఎంచుకోవచ్చు. తాత్కాలికంగా ఉద్యోగం పోయినప్పుడు, ఆదాయం కోల్పోయినప్పుడు ఈ పాలసీ ఆదుకుంటుంది.
* కనీసం 6 నెలల ఈఎంఐకి సరిపోయే మొత్తాన్ని ఎప్పుడూ అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి. దీనివల్ల మీపై ఆర్థిక ఒత్తిడి పడదు. తక్కువ ఈఎంఐ ఉండేలా రుణ వ్యవధిని ఎంచుకోవడం, మీ స్తోమతకు అనుగుణంగానే రుణాన్ని తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం.
* ఆదాయానికి మించి అప్పులు చేయొద్దు. మీకు వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి రుణ వాయిదాలకు వెళ్లకూడదు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి.. రూ.30వేల ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి 40 శాతం మేరకు ఈఎంఐలు చెల్లిస్తే.. మిగతా రూ.18వేలతో కుటుంబాన్ని నెట్టుకురాగలడా? రూ. లక్ష వేతనం ఉన్న వ్యక్తి.. రూ.40వేలు వాయిదాలకు చెల్లించినా.. మిగిలిన డబ్బును ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. కాబట్టి, ఆదాయం, ఖర్చులు చూసుకొని, ఈఎంఐ ఎంత ఉంటే ఇబ్బంది లేదో విశ్లేషించుకోవాలి.
అప్పులు తొందరగా తీర్చాలంటే..
మీ ఖర్చులకు కళ్లెం పడాల్సిందే. మీ నెలవారీ బడ్జెట్‌ను సిద్ధం చేయండి. అందులో ఖర్చులకు ప్రాధాన్యతా క్రమాన్ని ఇవ్వండి. తప్పనిసరి చెల్లించాల్సిన బిల్లులు, ఫీజులు, అనవసరమైన ఖర్చులు వేర్వేరుగా రాయండి. ముందుగా అవసరమైన వ్యయాలకు డబ్బు కేటాయించండి. వృథా వ్యయాల జోలికి అస్సలు వెళ్లకండి. ఇలా ఆదా చేసిన డబ్బును రుణాల చెల్లింపు కోసం వినియోగించండి.
అధిక రుణాలు ఉన్నప్పుడు వాటికి ఈఎంఐ చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. రెండు మూడు ఈఎంఐలు ఉన్నప్పుడు మన ఆర్థిక శక్తి సన్నగిల్లుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వ్యక్తిగత, వాహన, కార్డు రుణాలన్నింటినీ కలిపి ఒకే రుణంగా మార్చే ప్రయత్నం చేయొచ్చు. గృహరుణానికి టాపప్‌లోన్ తీసుకోవడంలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. రుణాన్ని చెల్లించేందుకు వ్యవధీ దొరుకుతుంది.
పరిస్థితులు చేజారిపోతున్నాయని భావించినప్పుడు.. బ్యాంకును సంప్రదించి, పరిష్కార మార్గం గురించి ఆలోచించాలి. రుణ పునర్వ్యవస్థీకరణ, మారటోరియంలాంటివి కొంత ఊరట కలిగించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఆర్డీలపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు ఇవే..
దేశంలో దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ అందిస్తున్నాయి. ఈ ఆర్డీలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి, ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు. -
క్రెడిట్ కార్డు బాధ్యతగా వాడండి
మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్.. వారికి 8.85% వరకు వడ్డీ
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం, సాధారణ పౌరులకు 8.6 శాతం వడ్డీ అందిస్తోంది. -
‘అమృత్ కలశ్’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?
SBI news: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ‘అమృత్ కలశ్’ డిపాజిట్ పథకం గడువును మరోమారు పొడిగించింది. -
విదేశీ విద్యా రుణాలు, వివిధ అంశాల గురించి తెలుసుకోండి?
విద్యార్థులు విదేశీ చదువుకు..రుణ సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయంతో పాటు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి, అవేంటో ఇక్కడ చూడండి. -
రుణాలు.. తొందరగా తీర్చేద్దాం
అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే. -
రూపే కార్డు వాడుతున్నారా? యూపీఐ యాప్ ద్వారా ఇక EMIగా మార్చుకోవచ్చు!
రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ యాప్‌లో త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి. -
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా