ఎఫ్‌డీతో పన్ను ఆదా

సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు ఉన్న మార్గం బ్యాంకులు అందించే ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.

Published : 20 Jan 2023 00:48 IST

పన్ను ప్రణాళిక 2023

సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు ఉన్న మార్గం బ్యాంకులు అందించే ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. రాబడికి హామీ ఉండటంతోపాటు, వడ్డీ రేట్లు 7 శాతం దరిదాపుల్లో ఉన్న నేపథ్యంలో చాలామందిని ఇవి ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారూ వీటిని పరిశీలించవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 80సీ ప్రకారం వివిధ పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసినప్పుడు రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. ఈ పథకాల్లో ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లూ ఒకటి. వీటిలో జమ చేసిన మొత్తాన్ని సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు క్లెయిం చేసుకోవచ్చు.
* వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పటికే మీ ఖాతా ఉన్న బ్యాంకులో లేదా ఇతర బ్యాంకులోనూ ఈ ఎఫ్‌డీని ప్రారంభించవచ్చు.
* ఈ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించాలి. వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాలి.
*  ఒక బ్యాంకులో వేసిన డిపాజిట్‌ నుంచి ఆర్థిక సంవత్సరంలో రూ.40వేలకు మించి వడ్డీ వచ్చినప్పుడు టీడీఎస్‌ చేస్తారు. ఫారం 15జీ, ఫారం 15 హెచ్‌ ఇవ్వడం ద్వారా టీడీఎస్‌ నుంచి మినహాయింపు పొందవచ్చు.
* సీనియర్‌ సిటిజన్లకు ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.50వేల వరకూ పన్ను ఉండదు.
* పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు వ్యవధి అయిదేళ్లు. గడువుకు ముందు వీటి నుంచి డబ్బు వెనక్కి తీయడం సాధ్యం కాదు. హామీగా ఉంచి రుణమూ తీసుకోలేం.
* ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని