IT Returns: ఐటీ రిటర్న్‌లు.. 5 కోట్లు: నేడే ఆఖరు తేదీ..

IT Returns: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు నేడే చివరి తేదీ అని ఐటీ విభాగం ప్రకటించింది. ‘ఇప్పటికే మీరంతా రిటర్నులు ఫైల్‌ చేశారని భావిస్తున్నాం. లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. అపరాధ రుసుము నుంచి తప్పించుకోండి’ అంటూ ట్విటర్‌ వేదికగా తెలిపింది.

Updated : 31 Jul 2022 09:29 IST

 

IT Returns: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు (ITR Filing)కు నేడే చివరి తేదీ అని ఐటీ విభాగం ప్రకటించింది. ‘ఇప్పటికే మీరంతా రిటర్నులు ఫైల్‌ చేశారని భావిస్తున్నాం. లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. అపరాధ రుసుము నుంచి తప్పించుకోండి’ అంటూ ట్విటర్‌ వేదికగా తెలిపింది. శనివారం నాటికి 5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలయ్యాయని, ఇందులో శనివారం ఒక్క రోజే 44.5 లక్షలకు పైగా రిటర్నులు వచ్చాయని వెల్లడించింది. ఆర్థిక శాఖతోపాటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రిటర్నుల దాఖలు ప్రక్రియను నిరంతరం గమనిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పోర్టల్‌లో ఎలాంటి సమస్యా ఎదురవకుండా.. సాంకేతిక నిపుణులతో ప్రత్యేక ‘వార్‌ రూం’ను ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుక్షణం గమనిస్తూ, వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రతి సమస్య, సందేహాలనూ వీలైనంత వెంటనే తీరుస్తున్నాం’ అని ఐటీ విభాగం సీనియర్‌ అధికారి తెలిపారు. గడువు తేదీ పొడిగింపు గురించి ఎలాంటి ఆలోచనా లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఏదైనా సమస్య వస్తే పాన్‌, ఫోన్‌ నెంబరు వివరాలను తెలియజేస్తూ orm@cpc.incometax.gov.in కు మెయిల్‌ చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని