Nithin Kamath: డిజిటలైజేషన్‌కి ముందు ఖాతా కోసం 40 పేజీలు కొరియర్‌ చేసేవాళ్లు: జిరోదా సీఈఓ

Nithin Kamath: డిజిటలైజేషన్‌ ద్వారా పనులు శరవేగంగా జరుగుతున్నాయని జిరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ అన్నారు. ఈ విషయాన్ని తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకున్నారు.

Updated : 24 Sep 2023 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటలైజేషన్‌ (digitisation)కు ముందు డీమ్యాట్‌ ఖాతా తెరిచే ప్రక్రియ చాలా కష్టంగా ఉండేదని స్టాక్ బ్రోకరేజీ సంస్థ జిరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ (Zerodha CEO Nithin Kamath) అన్నారు. ఒకప్పుడు స్టాక్‌ బ్రోకరేజ్‌ సైట్‌లో ఖాతా తెరవాలంటే ప్రతి కస్టమర్‌ 40 కంటే ఎక్కువ పేజీలు ఉన్న ఫారమ్‌లపై సంతకం చేసి కొరియర్‌ పంపేవారని అయన తెలిపారు. ఆ తర్వాత అప్రూవ్‌ కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని అన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. డిజిటలైజేషన్‌తో డీమ్యాట్‌ ఖాతాలు తెరిచే ప్రక్రియ వేగవంతం అయిందన్నారు. ఈ విషయాన్ని తన ‘ఎక్స్’ (ట్విటర్‌) ఖాతా ద్వారా పంచుకున్నారు.

‘60వేల మంది కస్టమర్‌లను సంపాదించుకోవటానికి 6 సంవత్సరాలు పట్టింది. వీరిలో ప్రతి ఒక్కరూ 40 కంటే ఎక్కువ పేజీలున్న ఫారమ్‌లపై సంతకం చేసి కొరియర్ చేసి రోజుల తరబడి వేచి ఉన్నవారే. డిజిటలైజేషన్‌ వచ్చిన తర్వాత 6 ఏళ్లలోనే కోటి మందికి పైగా వినియోగదారులను సంపాదించుకున్నాం. డిజిటలైజేషన్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన డిజిలాకర్, e-KYC (ఇ-కేవైసీ), e-Sign (ఇ-సైన్‌) వంటి సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ఖాతాలను తెరవడం, ఆర్థిక సేవలను యాక్సెస్ చేయడం సులభంగా మారింది’ అని కామత్‌ అన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో పేజీలు ముద్రించి రవాణాచేయాల్సిన అవసరం తప్పిందని దీంతో విలువైన సమయాన్ని ఆదా చేసుకోగలిగామన్నారు.

ఐఫోన్‌ 15 కొనబోతున్న ఎలాన్‌ మస్క్‌.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్‌!

‘2017 చివరి నాటికి 5 లక్షల మంది కస్టమర్లకు 900 మంది టీమ్‌ సభ్యులు ఉండేవాళ్లం. ప్రస్తుతం మాకు 1.3 కోట్ల మంది కస్టమర్‌లు ఉన్నారు. వారి కోసం కేవలం 1,100 మంది మాత్రమే పనిచేస్తున్నారు. డిజిటలైజేషన్‌తో మా కస్టమర్‌ సపోర్ట్‌ నాణ్యత గణనీయంగా పెరిగింది. అలాగే పేపర్‌లెస్‌ వర్క్‌ తీసుకురావటం మాకు బాగా సహాయపడింది’ అని అన్నారు. మధ్యవర్తులు లేకుండా వినియోగదారులతో నేరుగా వారి డిజిటల్ గుర్తింపు, సంతకం తప్పనిసరిగా ఆన్‌లైన్లోనే వెరిఫికేషన్ (IPV) చేయటం ద్వారా ఆన్‌బోర్డింగ్ సమయం గణనీయంగా తగ్గిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని