Budget 2023: కేంద్ర బడ్జెట్ - 2023లో ముఖ్యమైన 15 పాయింట్లు ఇవే!
కేంద్ర బడ్జెట్ (Union Budget 2023)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్లో ముఖ్యమైన పాయింట్లు ఇవీ...
ఇంటర్నెట్ డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ (Union Budget 2023)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్లో ప్రతిపాదించిన, వెల్లడించిన ముఖ్యమైన పాయింట్లు మీ కోసం...
- సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం - రైతులు ప్రధాన భూమికగా ఈ ఏడు అంశాలు ఉండటం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్ కాలేజ్‌లకు అనుమతి. 13 రకాలకుపైగా గుర్తింపు కార్డులకు బదులు పాన్ (PAN) ఒక్కటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రైల్వేల అభివృద్ధికి రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పీఎం ఆవాస్ యోజన పథకానికి నిధులు పెంపు. గతేడాది రూ.48 వేల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.79వేల కోట్లకు పెంపుదల.
- కర్ణాటక అప్పర్ భద్ర పథకానికి రూ.5,300 కోట్లు కేటాయింపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మహిళల కోసం సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. రెండేళ్ల కాలానికి తీసుకొస్తున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో... డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితి పెంపు. రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితి రూ.30లక్షలకు పెంపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఉన్నవారికి ఆదాయపు పన్ను రిబేట్ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంపు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. దీంతో వాటి ధరలు పెరుగుతాయి. టైర్లు, సిగరెట్ల ధరలూ పెరిగే అవకాశం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహన ధరలు . టీవీలు, మొబైల్, కిచెన్ చిమ్నీ, కెమెరాలు, లెన్స్, దిగుమతి చేసుకునే బంగారం ధరలు తగ్గుదల. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎంఎస్ఎంఈలకు ముందస్తు పన్ను రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంపు.
- మొత్తంగా కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చిరుధాన్యాల (శ్రీ అన్న) కేంద్రంగా భారత్. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని పెంచడం కోసం పీఎం-ప్రణామ్. వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థల కోసం ప్రత్యేక నిధి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: జగన్ పులివెందులకు ఏం చేశారు?: నారా లోకేశ్
-
Sports News
WTC Final: అదేం ఫీల్డింగ్.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Politics News
Jagan-Chandrababu: నంబూరుకు జగన్.. చంద్రబాబు పర్యటనపై సందిగ్ధత
-
Politics News
KTR: విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి: కేటీఆర్
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత.. ‘ఏఐ’ ఏం చెప్పిందంటే..?