Work Place: ఉద్యోగానికి భారత్‌లో అనువైన వర్క్‌ప్లేస్‌ ఇదే..

భారత్‌లో పనిచేసే వాతావారణం బాగున్న అత్యుత్తమ సంస్థగా టీసీఎస్‌ను ‘లింక్డిన్‌’ పేర్కొంది.

Published : 19 Apr 2023 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా కన్సల్జెన్సీ సర్వీసెస్‌ (TCS) ఈ ఏడాది భారతదేశంలో అత్యుత్తమ వర్క్‌ ప్లేస్‌ (మెరుగైన పని వాతావరణం) సంస్థగా నిలిచింది. అమెజాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ (LinkedIn) నివేదించింది. భారతదేశంలో టాప్‌ 25 వర్క్‌ ప్లేస్‌ల జాబితాను ఈ మేరకు లింక్డిన్‌ షేర్‌ చేసింది.

సంస్థ ప్రమాణాలు, నైపుణ్యాల పెరుగుదల, కంపెనీ స్థిరత్వం, బయటి అవకాశాలు, ఉద్యోగుల కంపెనీతో అనుబంధం, లింగ వైవిధ్యం మొదలైన 8 అంశాల ఆధారంగా ఈ నివేదికను  లింక్డిన్‌ రూదించింది. ఈ జాబితాలో ఉన్న సంస్థల్లో 17 కొత్తవి ఉన్నాయి. లింక్డిన్‌ 'టాప్‌ స్టార్టప్‌ లిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో జెప్టో 16వ స్థానంలో ఉంది. లొకేషన్‌ల విషయానికొస్తే, ఈ కంపెనీలు బెంగుళూరు, ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ, పుణె వంటి నగరాల్లో ప్రతిభావంతులైన అభ్యర్థులను నియమించుకొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని