
Health Insurance: టాప్ అప్ బీమా పాలసీ అవసరం ఉంటుందా?
సాధారణ ఆరోగ్య బీమా ఎంచుకున్న పరిమితి మేరకు మాత్రమే వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. ఒక వేళ ఏదైనా అనారోగ్యం కారణంగా.. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీ అందించే బీమా సొమ్ముకు మించి ఖర్చైతే మిగతా సొమ్మును మన చేతి నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవాలి అంటే ప్రీమియం భారం అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రూపొందించినవే టాప్-అప్ పాలసీలు. అందుబాటులో ఉండే ప్రీమియంతో అవసరం అయినప్పుడు అధిక మొత్తంలో బీమా చెల్లించి ఆదుకునే వీలును టాప్-అప్ పాలసీలు కల్పిస్తాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులకు ప్రస్తుత పాలసీ సరిపోదని భావించేవారు టాప్-అప్ పాలసీ తీసుకోవడం మంచిది.
ఉదాహరణకు, ఓ వ్యక్తి రూ. 3 లక్షలకు ఆరోగ్య బీమా చేయించుకున్నాడనుకుందాం. అతడికి అనారోగ్యం కలిగి వైద్యఖర్చులు రూ. 4.5 లక్షలు ఖర్చైతే బీమా కంపెనీ హామీ ఇచ్చిన రూ.3లక్షలే చెల్లిస్తుంది. మిగతా రూ. 1.5 లక్షలు ఆ వ్యక్తి స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.3లక్షల త్రెషోల్డ్ లిమిట్ కలిగిన టాప్-అప్ పాలసీ తీసుకున్నట్టయితే ఈ అదనపు సొమ్మును టాప్-అప్ పాలసీ ద్వారా క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది.
టాప్ అప్ పాలసీల ప్రత్యేకతలు..
* ఈ టాప్-అప్ పాలసీల ప్రీమియం, సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆర్యోగ బీమా పొందేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి.
* బేసిక్ పాలసీ లేకపోయినప్పటికీ టాప్-అప్ పాలసీ తీసుకోవచ్చు. అయితే కనీస త్రెషోల్డ్ లిమిట్ దాటాకే టాప్-అప్ పాలసీ వర్తిస్తుంది.
* టాప్-అప్ పాలసీని, బేసిక్ ఆరోగ్య బీమా కొనుగోలు చేసిన సంస్థ నుంచే తీసుకోవాలనే నిబంధనేమీ లేదు. ఇతర కంపెనీల టాప్-అప్ పాలసీలు తీసుకునే వీలుంది.
* టాప్-అప్ పాలసీలు వ్యక్తిగతంగా లేదా కుటుంబమంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌గా తీసుకోవచ్చు.
* సాధారణ ఆరోగ్య బీమా పాలసీ లేకుండా కూడా టాప్-అప్ పాలసీలు తీసుకునే వీలుంది.
* ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యల (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్)కు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందే వెయిటింగ్ పిరియడ్‌ను చెక్ చేసుకోవాలి.
* అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరిన ప్రతీసారి అయిన ఖర్చు విడివిడిగానే పరిగణిస్తారు. అంతేకానీ వీటన్నింటినీ కలిపి కనీస పరిమితి దాటినట్లుగా లెక్కలోకి తీసుకోరు. ఉదాహరణకు టాప్-అప్ కనీస పరిమితి రూ. 3 లక్షలు ఉన్నట్టయితే ఒకసారికి రూ. 2 లక్షలు ఖర్చు అయి, ఆ తర్వాత మరోసారి రూ. 2.5 లక్షలు అయితే వీటి రెండింటినీ కలిపి రూ. 4.5 లక్షలుగా పరిగణించరు. వేటికవే విడివిడిగా పరిగణిస్తారు.
* ఈ పరిమితిని అధిగమించేందుకు సంస్థలు ‘సూపర్ టాప్-అప్’ పాలసీలను అందిస్తున్నాయి. వీటిలో ఒక ఏడాదిలో విడివిడిగా అయిన వైద్యఖర్చులు కలిపి లెక్కకట్టి కనీస పరిమితికి పరిగణిస్తారు. ఈ సూపర్ టాప్-అప్ పాలసీలకు ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది.
* సాధారణంగా ఈ టాప్-అప్ పాలసీలు తీసుకునేవారు 45 ఏళ్లు మించనివారైతే వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి కాదు. ఒకవేళ ఆరోగ్య పరీక్షలు చేయిస్తే అందుకైన ఖర్చులో 50 శాతం వరకు బీమా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి.
* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డి కింద ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
గుర్తుంచుకోండి..
* టాప్-అప్ పాలసీలను ఆరోగ్య బీమా పాలసీలకు ప్రత్యామ్నాయంగా చూడకుండా కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కవరేజ్ పొందేందుకు ఉపయోగపడే సాధనాలుగా పరిగణిస్తే మంచిది.
* ఆరోగ్య బీమా పాలసీలు అయితే చిన్న మొత్తాలకు సైతం బీమా పొందేందుకు సౌకర్యం ఉంటుంది. అదే ఈ టాప్-అప్ పాలసీల్లో కనీస పరిమితి దాటాక మాత్రమే బీమా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల సమగ్ర బీమా పాలసీని ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి.
* ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి టాప్-అప్ ఎంచుకున్నట్టయితే, మనం ఎంచుకున్న పాలసీ కుటుంబంలో అందరికీ వర్తిస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. కొన్ని పాలసీలు తల్లిదండ్రులకు బీమా వర్తింపజేయడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!
-
Ap-top-news News
Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై వివాదం
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
-
Ap-top-news News
Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా
-
Ap-top-news News
Andhra News: వైకాపాకు ఓటేసి తప్పు చేశాం.. చెప్పులతో కొట్టుకుంటూ నిరసన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- రూ.19 వేల కోట్ల కోత
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా