Torrent Pharma: టొరెంట్‌ ఫార్మా చేతికి క్యురేషియో హెల్త్‌కేర్‌

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యురాటియో హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయనుంది....

Published : 27 Sep 2022 18:51 IST

దిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యురేషియో హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పంద విలువ రూ.2,000 కోట్లు. దీంతో టొరెంటోకు డెర్మటాలజీ విభాగంలో పట్టు నిలపుకొనేందుకు అవకాశం కలిగింది. కాస్మెటిక్‌, పీడియాట్రిక్‌ డెర్మటాలజీలో క్యురేషియో ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉంది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టెడిబార్‌, అటోగ్లా, స్పూ, బీ4 నప్పీ, పర్మైట్‌ వంటి దాదాపు 50 బ్రాండ్లు ఉన్నాయి. ఈ సంస్థ కు టాప్‌-10 బ్రాండ్ల నుంచే 75 శాతం ఆదాయం వస్తోంది.

2021-22లో క్యురేషియో రూ.224 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. దీంట్లో దాదాపు 82 శాతం డెర్మటాలజీ ఉత్పత్తుల నుంచే వచ్చింది. ఈ కొనుగోలుతో టొరెంట్ ఫార్మా టాప్‌-10 డెర్మటాలజీ ఉత్పత్తుల తయారీ సంస్థల జాబితాలో చేరనుంది. కొత్తగా 600 మంది మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, 900 మంది స్టాకిస్ట్‌లు కంపెనీలో చేరనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని