demat accounts: డీమ్యాట్‌ ఖాతాలు 16.2 కోట్లు

ఈ ఏడాది జూన్‌ చివరకు డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీస్, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ తెలిపాయి.

Published : 06 Jul 2024 01:57 IST

జూన్‌లో కొత్తగా 42 లక్షలు ప్రారంభం

దిల్లీ: ఈ ఏడాది జూన్‌ చివరకు డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 16.2 కోట్లకు చేరినట్లు సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీస్, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ తెలిపాయి. జూన్‌లో కొత్తగా 42.4 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు  తెరిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇవే అధికం. మేలో 36 లక్షల ఖాతాలు ప్రారంభమవ్వగా.. 2023 జూన్‌లో కొత్త ఖాతాల సంఖ్య 23.6 లక్షలుగా ఉంది. ఒక నెలలో 40 లక్షల కంటే ఎక్కువ డీమ్యాట్‌ ఖాతాలు తెరవడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతకు ముందు 2023 డిసెంబరు, 2024 జనవరి, ఫిబ్రవరిల్లో ఈ ఘనత సాధ్యపడింది. 

  • ఈ ఏడాది మేతో పోలిస్తే డీమ్యాట్‌ ఖాతాలు 4.24%, గతేడాది జూన్‌తో చూస్తే 34.66% పెరిగాయి. 
  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తుండటం, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల జోరు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, వచ్చే బడ్జెట్‌పై సానుకూల అంచనాలు కూడా మదుపర్ల ఆసక్తికి తోడైనట్లు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని