Toyota Glanza: 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కొత్త గ్లాంజా.. ధరెంతో తెలుసా?

జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా 2022 గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ కారును భారత్‌లో మంగళవారం విడుదల చేసింది....

Published : 15 Mar 2022 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా 2022 గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ కారును భారత్‌లో మంగళవారం విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.39 లక్షలు (ఎక్స్‌షోరూం).

ధరలు ఇలా..

2022 గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ ఈ, ఎస్‌, జీ, వీ  అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాప్‌ మూడు మోడళ్లలో ఏఎంటీ గేర్స్‌బాక్స్‌ అందుబాటులో ఉంది. 5 ఏళ్లు/2.2 లక్షల కి.మీ వారెంటీ కూడా ఇవ్వనుండడం విశేషం.

స్పెసిఫికేషన్లు, మైలేజీ..

ఈ సరికొత్త గ్లాంజాలో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 6,000 ఆర్‌పీఎం వద్ద 88.4 బీహెచ్‌పీ శక్తిని, 4,400 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.2 లీటర్‌ ఇంజిన్‌ డ్యుయల్‌ వేరియబుల్‌ వాల్వ్‌ ట్రైన్‌ టెక్నాలజీతో వస్తోంది. మాన్యువల్‌ వెర్షన్ లీటరుకి 22.35 కి.మీ, ఏఎంటీ వెర్షన్‌ 22.94 కి.మీ మైలేజీ ఇస్తోంది.

డిజైన్‌, ఫీచర్లు..

పాత వెర్షన్లతో పోలిస్తే 2022 గ్లాంజా డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. బంపర్‌, గ్రిల్‌ను అప్‌డేట్‌ చేశారు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల డిజైన్‌ను సైతం మార్చారు. 16 అంగుళాల అలాయ్ వీల్స్‌ కూడా కొత్త రూపునిచ్చాయి. వెనుకభాగంలోనూ బంపర్‌, టెయిల్‌లైట్స్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు.

ఇక లోపలి భాగాల్లోకి వెళితే.. డ్యుయల్‌ టోన్‌ ఇంటీరియర్‌ను అందిస్తున్నారు. 9 అంగుళాల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేతో కనెక్ట్‌ చేయొచ్చు. ‘హే టయోటా’ వంటి వాయిస్‌ కమాండ్స్‌తో కార్‌లోని కొన్ని ఫీచర్లను యాక్టివేట్‌ చేయొచ్చు. హెడ్స్‌ అప్‌ డిస్‌ప్లే, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, మల్టీ ఫంక్షన్‌ స్టీరింగ్‌ వీల్‌ వంటి ఫీచర్లూ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లే 360 డిగ్రీ పార్కింగ్‌ కెమెరాగానూ పనిచేస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈబీడీ, వెహికల్‌ సేఫ్టీ కంట్రోల్‌ వంటి భద్రతా ఫీచర్లనూ పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు