Toyota: టయోటా ఇన్నోవా హైక్రాస్‌ ధర ఇదే.. జనవరి నుంచి విక్రయాలు

నవంబర్‌లో విడుదలైన ఇన్నోవా హైక్రాస్‌ ధరలను టయోటా వెల్లడించింది. జనవరి నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

Updated : 23 Mar 2023 17:16 IST

ముంబయి: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) నవంబర్‌లో తీసుకొచ్చిన హైబ్రిడ్‌ వెర్షన్‌ ఇన్నోవా హైక్రాస్‌ (Innova HyCross) ధరలను వెల్లడించింది. దీని ధర రూ.18.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. వచ్చే నెల (జనవరి) నుంచి అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ కార్లు లభ్యమవుతాయని పేర్కొంది. నవంబర్‌లో దీని బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

సెల్ఫ్‌ ఛార్జింగ్‌ హైబ్రిడ్‌ వెర్షన్‌ కారు ధర వేరియంట్‌ను బట్టి రూ.24.01 లక్షల నుంచి రూ.28.97 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. గ్యాసోలిన్‌ వెర్షన్‌ రూ.18.30 లక్షల నుంచి రూ.19.20 లక్షల మధ్య లభిస్తుందని తెలిపింది. ఈ కారులో రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు సెల్ఫ్‌ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌, ఈ-డ్రైవ్‌ సీక్వెన్షియల్ సిఫ్ట్‌ సిస్టమ్‌ ఉన్నాయి. అంతేకాకుండా రెండులీటర్ల ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌లో కూడా ఈ కారు అందుబాటులో ఉంది. నవంబర్‌ 25న లాంచ్‌ అయిన ఈ కారుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని కంపెనీ అసిసోయేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌) అతుల్‌ సూద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని