Toyota Kirloskar hike prices: ఆ రెండు కార్ల ధరల్ని పెంచనున్న టయోటా

టయోటా కిర్లోస్కర్‌ (Toyota Kirloskar) తమ కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లోని ఎస్‌యూవీ అర్బన్‌ క్రూజర్ (Urban Cruiser)‌, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా (Glanza) ధరలను పెంచనున్నట్లు ప్రకింటింది....

Published : 29 Apr 2022 16:16 IST

దిల్లీ: టయోటా కిర్లోస్కర్‌ (Toyota Kirloskar) తమ కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లోని ఎస్‌యూవీ అర్బన్‌ క్రూజర్ (Urban Cruiser)‌, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా (Glanza) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మే 1, 2022 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ముడి సరకుల ధరలు పెరిగిన కారణంగానే ధరల్ని పెంచాల్సి వస్తోందని వివరించింది. 

ప్రస్తుతం అర్బన్ క్రూజర్‌ (Urban Cruiser) ధర రూ.8.88 - 11.58 లక్షల (ఎక్స్‌షోరూం) ఉంది. గ్లాంజా (Glanza) ధర రూ.6.39-9.96 లక్షలు (ఎక్స్‌షోరూం)గా కొనసాగుతోంది. మరి ఈ ధరలపై ఎంత వరకు పెంచనున్నారనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. స్టీల్‌, అల్యూమినియం సహా ఇతర కీలక లోహల ధరలు భారీగా పెరిగాయి. అలాగే ఇతర ముడి సరకుల వ్యయాలు కూడా గణనీయంగా పెరిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో తయారీ ఖర్చులు పెరిగి ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయాల్సి వస్తోందని టయోటా వివరించింది. గతవారం టాటా మోటార్స్ సైతం తమ ప్రయాణికుల వాహన ధరలను 1.1 శాతం మేర పెంచాయి. ఈ నెల ఆరంభంలో వాణిజ్య వాహనాల ధరలను 2-2.5 శాతం వరకు పెంచడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని