Toyota: నిన్న మారుతీ, నేడు టయోటా.. 1400 కార్ల రీకాల్‌

Toyota Recall: ఎయిర్‌బ్యాగ్‌లో లోపం ఉందని భావిస్తూ దాదాపు 1400 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు టయోటా మోటార్‌ తెలిపింది. ఏదైనా లోపం ఉంటే ఉచితంగా సరిచేసి ఇస్తామని పేర్కొంది.

Published : 19 Jan 2023 23:21 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (TKM) దాదాపు 1390 కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌బ్యాగ్‌లో లోపం కారణంగా గ్లాంజా, అర్బన్‌ క్రూజర్‌ హైర్డర్‌ మోడళ్లకు చెందిన కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది. ఇదే కారణంతో మారుతీ ప్రకటించిన మరుసటి రోజే టయోటా సైతం కార్లను వెనక్కి రప్పిస్తుండడం గమనార్హం.

గతేడాది డిసెంబర్‌ 8 నుంచి ఈ ఏడాది 12 మధ్య తయారైన కార్లను వెనక్కి రప్పించనున్నారు. ఎయిర్‌ బ్యాగ్‌ అసెంబ్లీ కంట్రోలర్‌లో లోపం ఉండొచ్చని అనుమానంగా ఉందని, అలాంటిదేమైనా ఉంటే సరిచేసి ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టయోటా డీలర్ల నుంచి వినియోగదారులకు సమాచారం అందుతుందని టయోటా పేర్కొంది. 

అంతకుముందు ఇదే లోపంతో ఉందని భావిస్తూ వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ బుధవారం వెల్లడించింది. డిసెంబరు 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన కార్లనే రీకాల్‌ చేస్తోంది. ఆల్టో కే10, ఎస్‌-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాంట్‌ విటారా మోడళ్ల కార్లకు ఈ రీకాల్‌ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు