డెబిట్ కార్డ్ ఉప‌యోగించేందుకు 5 చిట్కాలు

వినియోగ‌దారులు డెబిట్ కార్డును వినియోగించేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా పేర్కొంది. వినియోగ‌దారుల సంర‌క్ష‌ణ‌లో భాగంగా కొన్ని ముఖ్య‌మైన అంశాల‌ను వెల్ల‌డించింది. ఏదైనా వ‌స్తువు కొనుగోలు ..

Published : 16 Dec 2020 17:01 IST

వినియోగ‌దారులు డెబిట్ కార్డును వినియోగించేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా పేర్కొంది. వినియోగ‌దారుల సంర‌క్ష‌ణ‌లో భాగంగా కొన్ని ముఖ్య‌మైన అంశాల‌ను వెల్ల‌డించింది. ఏదైనా వ‌స్తువు కొనుగోలు చేసిన‌ప్పుడు డెబిట్ కార్డు వినియోగిస్తే నేరుగా ఖాతా నుంచి న‌గ‌దు వెళ్తుంది. ఎప్పుడూ డ‌బ్బు వెంటతీసుకొని వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా, డెబిట్ కార్డుల‌పై రుణాలు ల‌భించ‌వు. ఎస్‌బీఐ వినియోగ‌దారుల అవ‌స‌రాల‌ను బట్టి వివిధ ఏటీఎం-క‌మ్‌-డెబిట్ కార్డుల‌ను అందిస్తుంది. ప్లాటినం ఇంట‌ర్నేష‌న‌ల్ డెబిట్ కార్డ్, స్టేట్ బ్యాంక్ గిఫ్ట్ కార్డ్, స్టేట్ బ్యాంక్ ప్రైడ్ కార్డ్‌, స్టేట్ బ్యాంక్ పెహెలా క‌ద‌మ్ అండ్ పెహ్లీ ఉడాన్ ఫోటో డెబిట‌త్ కార్డు (మైన‌ర్ల‌కు మాత్ర‌మే), sbiINTOUCH ట్యాప్, గో డెబిట్ కార్డ్ వంటి వివిధ ర‌కాల కార్డ్‌ల‌ను జారీచేస్తుంది.

డెబిట్ కార్డ్ ఉప‌యోగించేందుకు 5 చిట్కాలు:

  1. డెబిట్ కార్డ్ ఉప‌యోగించేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.
  2. లావాదేవీలు లేదా న‌గ‌దు విత్‌డ్రా చేసుకున్న త‌ర్వాత మొబైల్‌కి ఎస్ఎంఎస్ వ‌చ్చిందా లేదా చెక్ చేసుకోవాలి.
  3. ఏటీఎం నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకున్న త‌ర్వాత ర‌శీదుల‌ను ఇత‌రుల‌కు క‌న‌ప‌డ‌కుండా ప‌డేయాలి
  4. డెబిట్ కార్డ్ వివ‌రాల‌ను ఎవ‌రికీ వెల్ల‌డించ‌కూడ‌దు.
  5. డెబిట్ కార్డ్ వినియోగంపై రోజుకు కొంత ప‌రిమితి ఉంటుంది. అందుకే అతిపెద్ద లావాదేవీల‌కు ఆస్కారం ఉండ‌దు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని