Credit Card: క్రెడిట్‌కార్డుపై రివార్డు పాయింట్లను ఇలా ట్రాక్ చేయండి
క్రెడిట్ కార్డుపై ఉన్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచడానికి ఉన్న మార్గాలను చూద్దాం....
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు (Credit card) ద్వారా చేసే చెల్లింపులకు రివార్డు పాయింట్ల (Reward Points) రూపంలో ప్రయోజనాలు లభిస్తుంటాయి. వీటిని నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. లేదా కొనుగోళ్ల సమయంలో రాయితీ పొందొచ్చు. వివిధ మార్గాల ద్వారా మీ క్రెడిట్ కార్డు (Credit card)పై ఉన్న ప్రయోజనాలను కంపెనీలు మీకు తెలియజేస్తుంటాయి. అయితే, అన్నింటినీ గుర్తుంచుకోవడం అంత సులభం కాదు. పైగా మన పనుల్లో తీరికలేక వీటిని మర్చిపోతే ప్రయోజనాల కాలపరిమితి ముగిసిపోతుంటుంది. మరి వీటిపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచడానికి ఉన్న మార్గాలను చూద్దాం.
క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ను తరచూ చెక్ చేసుకోండి..
నెలవారీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ కార్డు (Credit card)పై ఉన్న పాయింట్లు ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకోవచ్చు. మీరు చేసిన ఖర్చు, లభించిన రివార్డులు (Reward Points) , వాటి కాలపరిమితి వంటి వివరాలు వాటిలో ఉంటాయి. ఫలితంగా మీకు వాటిపై ఓ అవగాహన ఉంటుంది. గడవులోగా ఉపయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది.
రివార్డుల కాలపరిమితి ముందే తెలుసుకోవాలి...
రివార్డు పాయింట్ల (Reward Points) లభించిన వెంటనే అవి మీ క్రెడిట్ ఖాతాలో జమ అవుతాయి. కార్డుని బట్టి వాటి కాలపరిమితి ఆధారపడి ఉంటుంది. ఫిన్బూస్టర్ వంటి కార్డుల్లో పాయింట్లకు కాలపరిమితి ఉండదు. కొన్నింట్లో రివార్డు పాయింట్ల (Reward Points)ను ఉపయోగించుకోవడానికి 18-36 ఏళ్ల గడువు ఉంటుంది. దీన్ని తెలుసుకుంటే మీకు పాయింట్లు క్రెడిట్ అయిన దగ్గరి నుంచి ఆ గడువులోగా ఉపయోగించుకోవాలన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవచ్చు.
రివార్డు పాయింట్లను ఎప్పటికప్పుడు ఉపయోగించుకోండి..
అన్ని రివార్డు పాయింట్లకు ఒకే కాలపరిమితి ఉండదు. చాలా పాయింట్లు పోగుపడి ఉంటే.. తొలుత గడువు తీరే పాయింట్లను ఉపయోగించడం ప్రారంభించాలి. ఇలా క్రమంగా రివార్డు పాయింట్లను వాటి కాలపరిమితులను అనుసరించి వాడుకోవాలి. ఫలితంగా మిగిలి ఉన్న పాయింట్లను ఎప్పుడు ఉపయోగించుకోవాలనే అంశంపై మీకు ఓ అవగాహన వస్తుంది. తద్వారా రివార్డు పాయింట్లు ప్రభావవంతంగా ఉపయోగించుకున్నవారవుతారు.
ట్రాకింగ్ యాప్స్ వాడండి..
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు వాటిని సమర్థంగా నిర్వహించుకునేందుకు కొన్ని మొబైల్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ క్రెడిట్ బిల్లింగ్ తేదీలు, రివార్డు పాయింట్ల వివరాలు, వాటి కాలపరిమితి వంటి అంశాలను ఎప్పటికప్పుడు మీకు గుర్తుచేస్తుంటాయి.
వార్షిక మైల్స్టోన్లు..
కొన్ని కార్డుల్లో ఏడాదిలో నిర్దేశించిన మొత్తం ఖర్చు చేస్తే ప్రత్యేకంగా రివార్డు పాయింట్లు లభిస్తుంటాయి. అందుకే రెండు, మూడు కార్డులు ఉన్నవారు ఒక కార్డుపై పరిమితిని ఉపయోగించుకొని రివార్డు పాయింట్లు పొందడానికి ప్రయత్నించాలి. తర్వాతే మరోకార్డును వాడుకోవాలి. ఫలితంగా లభించే ప్రత్యేక పాయింట్ల వల్ల కొనుగోళ్లపై కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే, ఒకే కార్డును ఉపయోగించేటప్పుడు మీ కార్డు యుటిలైజేషన్ రేషియో 50 శాతం మించకుండా చూసుకోవాలి. లేదంటే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది.
క్రెడిట్ కార్డులు తరచూ ఉపయోగించుకునేవారికి రివార్డు పాయింట్ల రూపంలో కొంత మొత్తాన్ని ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే పాయింట్ల ప్రయోజనాలను పొందలేరు. మరి మీరు కార్డుని సమర్థంగా ఉపయోగించుకోనట్లవుతుంది. అందుకే పాయింట్లను ప్రభావవంతంగా వాడుకోవాలంటే వాటిని కాలపరిమితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
Digilocker: డిజీ లాకర్‌తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్‌గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్‌తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్‌లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్‌ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం