Tracxn Technologies IPO: ప్రారంభమైన ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!

Tracxn Technologies IPO: నేటి నుంచి ట్రాక్షన్‌ టెక్‌ ఐపీఓ ప్రారంభమైంది. ఈ నెల 12 వరకు కొనసాగుతుంది. ధరల శ్రేణిని రూ.75-80గా నిర్ణయించారు.

Published : 10 Oct 2022 11:23 IST

Tracxn Technologies IPO: ప్రైవేటు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాం అయిన ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ (Tracxn Technologies IPO) సోమవారం ప్రారంభమైంది. ఈ ఐపీఓ షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగనుంది. మొత్తం  రూ.309 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఐపీఓ కీలక వివరాలు..

  • ధర శ్రేణి: రూ.75-80
  • బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: అక్టోబరు 17
  • రీఫండ్ల ప్రారంభం: అక్టోబరు 18
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ: అక్టోబరు 19
  • లిస్టింగ్‌ తేదీ: అక్టోబరు 20
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 185 (ఒక లాట్‌)
  • ఒక్కో షేరు ముఖ విలువ: రూ.01

వివిధ వర్గాలకు షేర్ల కేటాయింపు తీరు..

  • అర్హతగల సంస్థాగత మదుపర్ల వాటా: కనిష్ఠంగా 75%
  • సంస్థాగతేతర మదుపర్ల వాటా: గరిష్ఠంగా 15%
  • చిన్న మదుపర్లు: గరిష్ఠంగా 35%

కంపెనీ వివరాలు..

ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ (Tracxn Technologies)ను 2013లో స్థాపించారు. ఈ కంపెనీ ప్రైవేట్‌ కంపెనీలకు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ డేటా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు సంబంధించిన లోతైన, ప్రత్యేకమైన సమాచారాన్ని ట్రాక్షన్‌ టెక్‌ తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అందజేస్తుంది. ఇలాంటి సేవలు అందిస్తున్న ప్రపంచంలోనే అత్యుత్తమ పది సంస్థల జాబితాలో ఇది ఐదో స్థానంలో ఉంది. మార్చి 31, 2021 నాటికి ఈ కంపెనీ 662 మిలియన్ల వెబ్‌ డొమైన్లను స్కాన్‌ చేసింది. 1.84 మిలియన్‌ సంస్థలను ప్రొఫైల్‌ చేసి ఉంచింది. ట్రాక్షన్‌ టెక్‌కు ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల్లో 3,271 మంది యూజర్లు ఉన్నారు. వీటిలో కొన్ని ఫార్చూన్‌ 500 జాబితాలోని కంపెనీలు కూడా ఉండడం విశేషం. ఇతర కంపెనీలతో డీల్‌ సోర్సింగ్‌, కొనుగోలు ఒప్పందం, వర్ధమాన థీమ్‌ల గుర్తింపు, డీల్‌ డిలిజెన్స్‌, వివిధ వ్యాపారాల విశ్లేషణకు సంబంధించిన సమాచారం కావాల్సిన కంపెనీలకు ట్రాక్షన్‌ ఓ వేదికగా మారింది.

సంస్థ ఆర్థిక వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని