పోస్టాఫీస్‌ పీపీఎఫ్ ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా నగదు డిపాజిట్ చేసే విధానం..

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు ఐపీపీబీ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేయవచ్చు......

Published : 25 Dec 2020 15:38 IST

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు ఐపీపీబీ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేయవచ్చు

పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పన్ను మినహాయింపు, ప్రమాద రహిత పొదుపు పథకాలలో ఒకటి. ఏప్రిల్ 1 నుంచి పీపీఎఫ్ పెట్టుబడిపై 7.1 శాతం రాబడి లభిస్తుంది, ఇది జనవరి-మార్చి త్రైమాసికంలో చెల్లించిన 7.9 శాతం వడ్డీ రేటుతో పోలిస్తే 80 బేసిస్ పాయింట్లు తక్కువ. ఏప్రిల్-జూన్, 2020 త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 70 నుంచి 140 బేసిస్ పాయింట్లకు తగ్గించింది.

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేయవచ్చు. కావున, పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతాదారులు ఐపీపీబీ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ ద్వారా డబ్బును తమ పీపీఎఫ్ ఖాతాలో జమ చేయవచ్చు, ఇది లావాదేవీలను సజావుగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

మీ పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌లో ఐపీపీబీ ద్వారా డబ్బు బదిలీ చేసే విధానాన్ని మీకోసం కింద తెలియచేస్తున్నాము :

  1. మీ బ్యాంకు ఖాతా నుంచి మీ ఐపీపీబీ ఖాతాకు డబ్బును జోడించండి.

  2. డీఓపీ సర్వీసెస్ కు వెళ్ళండి.

  3. అక్కడ నుంచి మీరు రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృధి ఖాతా, రికరింగ్ డిపాజిట్‌ పై రుణం వంటి ప్రోడక్ట్ ను ఎంచుకోవచ్చు.

  4. ఒకవేళ మీరు మీ పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయాలనుకుంటే, అప్పుడు ప్రావిడెంట్ ఫండ్ పై క్లిక్ చేయండి

  5. మీ పీపీఎఫ్ ఖాతా నంబర్, డీఓపీ కస్టమర్ ఐడీని నమోదు చేయండి.

  6. జమ చేయాలనుకుంటున్న మొత్తాన్ని పేర్కొని, ‘పే’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

  7. ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా విజయవంతంగా చెల్లింపు బదిలీ చేసిన విషయాన్ని ఐపీపీబీ మీకు తెలియజేస్తుంది.

  8. మీరు ఇండియా పోస్ట్ అందించే వివిధ పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి ఆప్షన్ లను ఎంచుకుని, ఐపీపీబీ ప్రాథమిక పొదుపు ఖాతా ద్వారా క్రమం తప్పకుండా చెల్లింపులు చేయవచ్చు.

  9. యాప్ ను ఉపయోగించి ఫండ్స్ ఇతర బ్యాంకు ఖాతాల నుంచి ఐపీపీబీ కి బదిలీ చేయవచ్చు.

  10. అదే విధంగా, మీరు మీ ఆర్డీ లేదా సుకన్య సమృద్ది ఖాతాలో ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా డబ్బు జమ చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని