ఈపీఎఫ్ నుంచి ఎన్పీఎస్ కి బదిలీ సాధ్యమా?

భారత దేశపు పింఛను నియంత్రణ సంస్థ ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లోని సభ్యులను ప్రోవిడెంట్ ఫండ్ నుండి ఎన్పీఎస్ కు తమ పదవీ విరమణ పొదుపును బదిలీ చేసే సౌకర్యం కలిపిస్తుంది.....

Published : 16 Dec 2020 16:49 IST

భారత దేశపు పింఛను నియంత్రణ సంస్థ ఈపీఎఫ్ నుండి ఎన్పీఎస్ కు మారే అవకాశం కలిపిస్తుంది​​​​​​​

భారత దేశపు పింఛను నియంత్రణ సంస్థ ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లోని సభ్యులను ప్రోవిడెంట్ ఫండ్ నుండి ఎన్పీఎస్ కు తమ పదవీ విరమణ పొదుపును బదిలీ చేసే సౌకర్యం కలిపిస్తుంది. ఈ ఆప్షన్ ముందు నుండి లేకపోయినా ఎన్పీఎస్ కి పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గుర్తించబడిన ప్రావిడెంట్ ఫండ్ లేదా వృద్దాప్య ఫండ్ నుండి ఎన్పీఎస్ కి బదిలీ చేయబడ్డ డబ్బు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఆదాయంగా గుర్తించబడదు కావున ఉద్యోగి పన్ను కట్టే అవసరం ఉండదు. గుర్తించబడిన ప్రావిడెంట్ ఫండ్ లేదా వృద్దాప్య ఫండ్ కి ఉద్యోగి తరపున వాటా చెల్లింపుగా దీన్ని గుర్తించరు కనుక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగి ఆదాయ పన్ను మినహాయింపు చేసుకోవడానికి వీలు లేదు. చందాదారుడు తన సంస్థ ద్వారా సంబంధిత పీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించి తన పీఎఫ్ ఖాతా లోని సొమ్మును ఎన్పీఎస్ కి బదిలీ చేయడానికి దరఖాస్తు చేయవచ్చు. ఇన్కమ్ ట్యాక్ ఆక్ట్ 1961 లోని నియమాల ప్రకారం ఫండ్ ని బదిలీ చేయడానికి గుర్తించబడిన ప్రావిడెంట్ ఫండ్ / వృద్దాప్య ఫండ్ ట్రస్ట్ తగిన చర్యలు తీసుకుంటుంది.

నియమాల ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ నుండి ఎన్పీఎస్ కి బదిలీ చేసుకునే వారికి క్రియాశీల ఎన్పీఎస్ టయర్ - 1 అకౌంట్ తప్పని సరిగా ఉండాలి. దీన్ని ఉద్యోగి తన సంస్థ ద్వారా లేదా ఎన్పీఎస్ ట్రస్ట్ వెబ్సైటు లోని ఈ-ఎన్పీఎస్ ఆప్షను ద్వారా ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని