మీ ఎన్‌పీఎస్ ను బదిలీ చేసుకోండిలా..

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఒక ఎస్‌జీ నుంచి మ‌రో ఎస్‌జీకి మారేందుకు ఐఎస్ఎస్‌-1ను నోడ‌ల్ కార్యాల‌యం నందు స‌మ‌ర్పించాలి...

Published : 22 Dec 2020 15:43 IST

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఒక ఎస్‌జీ నుంచి మ‌రో ఎస్‌జీకి మారేందుకు ఐఎస్ఎస్‌-1ను నోడ‌ల్ కార్యాల‌యం నందు స‌మ‌ర్పించాలి​​​​​​​

శాశ్వ‌త ప‌ద‌వీ విర‌మ‌ణ ఖాతా సంఖ్య (ప్రాన్‌) అనేది జాతీయ పింఛ‌ను ప‌థ‌కంలో కేటాయించే విశిష్ట సంఖ్య‌. ఉద్యోగం చేసే ప్ర‌దేశం లేదా ఒక ఉద్యోగం నుంచి మ‌రో ఉద్యోగానికి మారిన‌ప్పుడు వ్య‌క్తిగ‌త ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అలాంట‌ప్పుడు ప్రాన్‌ సంఖ్య‌లో ఎటువంటి మార్పు ఉండ‌దు.

బ‌దిలీ చేసుకునేందుకు…

పీవోపీ విష‌యంలో బ‌దిలీ కోసం ప్ర‌స్తుత పీవోపీ-ఎస్పీ వ‌ద్ద యూవోఎస్‌-ఎస్‌5ను గానీ లేదా
కొత్త పీవోపీ వ‌ద్ద యూవోఎస్‌-ఎస్‌6ను గాని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. కార్పొరేట్ చందాదారులు ఉద్యోగం మారి, ఎన్‌పీఎస్ కింద న‌మోదు కాని సంస్థ‌లో ఉద్యోగంలో చేరితే అలాంటి వారు ఆల్ సిటిజ‌న్ ఆఫ్ ఇండియా విభాగం కింద ప్రాన్‌ను కొన‌సాగించ‌వ‌చ్చు.

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఒక ఎస్‌జీ నుంచి మ‌రో ఎస్‌జీకి మారేందుకు ఐఎస్ఎస్‌-1ను నోడ‌ల్ కార్యాల‌యం నందు స‌మ‌ర్పించాలి. https://npscra.nsdl.co.in ద్వారా బ‌దిలీ ఫారంల‌ను పొంద‌వ‌చ్చు.

ఫారంలో పొందు ప‌ర‌చాల్సిన వివ‌రాలు :

  • ఖాతాదారు పేరు, చిరునామా
  • ప్రాన్ వివ‌రాలు
  • పాత‌, కొత్త పీవోపీ- ఎస్‌పీ వివ‌రాలు

పౌరులంద‌రికీ ఉమ్మ‌డి నియ‌మావ‌ళి :

  • పింఛ‌ను ఫండ్ నిర్వాహ‌కుడిని ఎంచుకోవాలి.
  • పెట్టుబడి ఆప్ష‌న్‌- యాక్టివ్ లేదా ఆటో-ఛాయిస్‌ల‌లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి.
  • అసెట్ అల్లొకేష‌న్‌ను సూచించాలి.

ప్ర‌భుత్వ కొలువులో చేరితే…

  • వేత‌నం, సంస్థ పేరు
  • సంస్థ య‌జ‌మాని ధ్రువీక‌ర‌ణ‌
  • బ్యాంకు వివ‌రాల కోసం క్యాన్సిల్డ్ చెక్కు

ప్రైవేటు ఉద్యోగానికి మారిన‌ప్పుడు …

  • స‌భ్యులు ఉద్యోగ‌, బ్యాంకు, పాన్ కార్డు వివ‌రాలు అందించాలి.
  • అంతేకాకుండా పింఛ‌ను ఫండ్ నిర్వాహ‌కుడిని, పెట్టుబ‌డి ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

బ‌దిలీ విధానం :

  • ద‌ర‌ఖాస్తు ఫారాన్ని, అనుబంధ ప‌త్రాల‌ను జోడించి ఏదైనా పీవోపీ-ఎస్‌పీ కేంద్రంలో స‌మ‌ర్పించాలి.
  • స్టాంపు వేసిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను మ‌న‌కు అందిస్తారు.
  • వివ‌రాల‌న్నీ స‌రిపోల్చాక‌, జ‌రిగిన మార్పుల‌ను స‌భ్యుడికి తెలియజేస్తారు.

ముఖ్య‌మైన అంశాలు :

  • ఈ ప్ర‌క్రియ స‌జావుగా పూర్త‌య్యేందుకు ప్రాన్ సంఖ్య క్రియాశీల‌కంగా ఉండాలి.
  • ప్రాన్ సంఖ్య వివ‌రాలు, ఉద్యోగ స‌మాచారం, వేత‌న స‌మాచారం త‌దిత‌రాల‌న్నీ క‌చ్చితంగా నింపాలి. ఇవ‌న్నీ జాతీయ పింఛ‌ను ప‌థ‌కం రికార్డుల్లో న‌మోద‌వుతాయి కావున జాగ్ర‌త్త వ‌హించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని