'ట్రాన్సిట్ కార్డ్' లాంచ్ చేసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌

`ఏటీఎం`ల నుండి డ‌బ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కూడా ఈ కార్డులో స‌దుపాయం ఉంది.

Updated : 30 Nov 2021 13:37 IST

భార‌తీయులు ప‌లు ర‌కాల‌ బ్యాంకింగ్ లావాదేవీల‌ను సుల‌భంగా నిర్వ‌హించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ట్రాన్సిట్ కార్డ్ ప్రారంభించ‌బ‌డింది. దేశంలో కోటి కంటే ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్‌ల‌ను జారీ చేసి మైలురాయిని సాధించిన  మొట్ట మొద‌టి బ్యాంకుగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ ఘ‌న‌త సాధించింది. `ఫాస్టాగ్‌` విజ‌య‌వంత‌మైన‌ త‌ర్వాత ఈ కేట‌గిరిలో పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌ తీసుకొచ్చిన రెండ‌వ ప్రాడక్ట్ ఈ ట్రాన్సిట్‌ కార్డ్‌. 

ఒకే దేశం, ఒకే కార్డు అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని `పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌` సోమ‌వారం పేటీఎం ట్రాన్సిట్ కార్డ్‌ని ప్రవేశ పెట్టింది. మెట్రో, రైల్వేలు, ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని బ‌స్సు సేవ‌లు, పార్కింగ్ ఛార్జీలు, ఆఫ్‌లైన్ మ‌ర్చంట్ స్టోర్ల‌లో చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ మొద‌లైన‌ రోజువారి అవ‌స‌రాల‌కు వినియోగించ‌డంతో పాటు, `ఏటీఎం`ల నుంచి డ‌బ్బు కూడా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

కార్డు కోసం పేటీఎమ్ యాప్‌లో డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీంతోపాటు రీఛార్జ్‌, లావాదేవీల ట్రాకింగ్ కూడా పేటీఎమ్ యాప్ ద్వారా చేయ‌వ‌చ్చు. కార్డును వినియోగ‌దారుని ఇంటికే డెలివ‌ర్ చేస్తారు. లేదా నిర్ధేశించిన విక్ర‌య కేంద్రాల‌లో అందుబాటులో ఉంటుంది. ప్రీపెయిడ్ కార్డుని  పేటీఎమ్ వ్యాలెట్‌కి నేరుగా లింక్ చేసుకోవ‌చ్చు. 

హైద‌రాబాద్‌ మెట్రో రైల్‌ వినియోగ‌దారులు ట్రాన్సిట్ కార్డును కొనుగోలు చేసి ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ సేవ‌లతో ప్ర‌తీ రోజు దాదాపు 50 ల‌క్ష‌ల మంది ఇబ్బందులు లేకుండా మెట్రో/బ‌స్సు/రైలు కనెక్టివిటీతో సేవ‌ల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌, అహ్మ‌దాబాద్ మెట్రో వినియోగ‌దారుల‌కు ఈ కార్డు సేవ‌లు అందిస్తుంది. ఈ కార్డ్ ప్రారంభంతో..ల‌క్ష‌లాది మంది భార‌తీయులు ఒకే కార్డును ఉప‌యోగించి బ్యాంకింగ్‌తో అన్ని ర‌కాల ర‌వాణా సౌక‌ర్యాల‌ను పొందేందుకు వీలుంద‌ని సంస్థ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని