యూపీఐ సేవలు నిలిపేయనున్న ట్రూకాలర్
నాలుగేళ్ల క్రితం కాలర్ ఐడీ అప్లికేషన్ ట్రూకాలర్‌లో ప్రవేశపెట్టిన యూపీఐ సేవలు ఇకపై భారత్‌లో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ట్రూకాలర్ ప్రతినిధులు సోమవారం
బెంగళూరు: నాలుగేళ్ల క్రితం కాలర్ ఐడీ అప్లికేషన్ ట్రూకాలర్‌లో ప్రవేశపెట్టిన యూపీఐ సేవలు ఇకపై భారత్‌లో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ట్రూకాలర్ ప్రతినిధులు సోమవారం వెల్లడించారు. దేశంలో ట్రూకాలర్ పే పేరుతో ట్రూకాలర్ యూపీఐ చెల్లింపులు నిర్వహిస్తోంది. ట్రూకాలర్ యాప్‌ను వినియోగదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు ఈ సేవలను నిలిపేస్తున్నట్లు ట్రూకాలర్ ప్రతినిధులు వెల్లడించారు. కమ్యునికేషన్, భద్రత సంబంధిత అంశాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు వినియోగదారులకు రెండు వారాల క్రితం నోటీసును ఇచ్చామని వారు పేర్కొన్నారు. ఇప్పటికే యూపీఐ చెల్లింపులకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో తమ యాప్ ద్వారా భద్రత, కమ్యునికేషన్‌ను అందిస్తామని తెలిపారు. 2020 మధ్యకాలంలో ట్రూకాలర్ పేలో 20 మిలియన్ల యూపీఐ అకౌంట్లు ఉన్నాయి. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు ఇది అనుసంధానమై ఉంది.
ట్రూకాలర్ తాజాగా గార్డియన్ అనే సేఫ్టీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో గార్డియన్స్‌గా కొందరిని ఎంచుకొని మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందేలా చేయొచ్చు. వారికి లొకేషన్ పంపడంతో వారు మన కదలికల్ని గుర్తించగలుగుతారు. ఎప్పుడైనా ప్రమాదకర పరిస్థితుల్లోపడినపుడు ఐ నీడ్ హెల్ప్ అన్న ఆప్షన్‌ను నొక్కితే చాలు. గార్డియన్లు గుర్తించి అప్రమత్తమవుతారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్