TVS Apache: టీవీఎస్‌ నుంచి కొత్త అపాచీ RTR 160, 180 మోడళ్లు.. ధర, ఫీచర్లివే..

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టీవీఎస్‌ (TVS) సరికొత్త అపాచీ మోడళ్లను విడుదల చేసింది. విజయవంతమైన ఈ శ్రేణిలో ఆధునికీకరించిన అపాచీ RTR 160, RTR 180 మోడళ్లను తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Updated : 08 Sep 2022 22:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టీవీఎస్‌ (TVS) సరికొత్త అపాచీ మోడళ్లను విడుదల చేసింది. విజయవంతమైన ఈ శ్రేణిలో ఆధునికీకరించిన అపాచీ RTR 160, RTR 180 మోడళ్లను తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. RTR 160 సీసీ ధరను రూ.1.17 లక్షలుగా (బేస్‌ వేరియంట్‌), RTR 180 సీసీ ధరను రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కొత్త మోడళ్లు తేలికైనవని, వేగవంతమైనవని, సాంకేతికంగా అధునాతన ఫీచర్లు కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. గురువారం నుంచే బుకింగ్‌లు ప్రారంభమైనట్లు పేర్కొంది.

కొత్త అపాచీ మోడళ్లలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌లను ఇస్తున్నారు. వెనుక వైపు మరింత మందంగా ఉండే టైర్లను అమర్చారు. RTR 160 ఇంజిన్‌ 15.3 బీహెచ్‌పీని, RTR 180 మోడల్‌ 16.8 శాతం బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. రెండింట్లోనూ టీవీఎస్‌ స్మార్ట్‌కనెక్ట్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీ ఆప్షన్‌ను అందిస్తు్న్నారు. డిజిటల్‌ ఇన్సుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో గేర్‌ పొజిషన్‌తో పాటు గేర్‌ షిఫ్ట్‌ ఇండికేటర్‌ను అందిస్తున్నారు. రెయిన్‌, అర్బన్‌, స్పోర్ట్‌ పేరిట మూడు రైడింగ్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. RTR 180 2 రంగుల్లో, RTR 160 మూడు రంగుల్లో లభిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని