TVS: డ్రైవ్‌ఎక్స్‌లో టీవీఎస్‌కు 48 శాతం వాటా!

ప్రముఖ ఫార్ములా 1 డ్రైవర్‌ నరైన్‌ కార్తికేయన్‌కు చెందిన ద్విచక్రవాహన అంకుర సంస్థ డ్రైవ్‌ఎక్స్‌లో 48.27 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ బుధవారం వెల్లడించింది....

Published : 24 Aug 2022 23:07 IST

దిల్లీ: ప్రముఖ ఫార్ములా 1 డ్రైవర్‌ నరైన్‌ కార్తికేయన్‌కు చెందిన ద్విచక్రవాహన అంకుర సంస్థ ‘డ్రైవ్‌ఎక్స్‌’లో 48.27 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రూ.85 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

‘ఎన్‌కార్స్‌ మొబిలిటీ మిల్లీనియల్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట రిజిస్టర్‌ అయిన ఈ అంకుర సంస్థ డ్రైవ్‌ఎక్స్‌ బ్రాండ్‌ పేరిట పాత మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల లీజు, విక్రయాలు, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం చేస్తోంది. ఈ విభాగంలో నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్న డ్రైవ్‌ఎక్స్‌ ఆ దిశగా సాగుతోందని తాము నమ్ముతున్నామని టీవీఎస్‌ ఎండీ సుదర్శన్‌ వేణు తెలిపారు.

మరోవైపు డ్రైవ్‌ఎక్స్‌ సీఈఓ కార్తికేయన్‌ మాట్లాడుతూ.. త్వరలో సబ్‌స్క్రిప్షన్‌ వంటి కొత్త బిజినెస్‌ మోడల్స్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీ రూ.9 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. 2022 నవంబరు 30 నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని టీవీఎస్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని