Twitter: యాపిల్‌తో పంచాయితీ.. ట్విటర్ బ్లూ మరింత ఆలస్యం!
మస్క్ చేతిలో ట్విటర్ సురక్షితం కాదని మాజీ ఉన్నతోద్యోగి ఆరోపించారు. మరోవైపు ట్విటర్ బ్లూ యూజర్లు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్లో వెరిఫైడ్ యూజర్లకు ఇచ్చే బ్లూ టిక్ పునఃప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇందుకు యాపిల్‌తో తలెత్తిన వివాదమే కారణమని తెలుస్తోంది. ట్విటర్ యాప్‌లో యాపిల్ ప్రకటనలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతోపాటు యాప్ స్టోర్‌లో యాప్‌లకు 30 శాతం రుసుము వసూలు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా యాప్ స్టోర్ నుంచి ట్విటర్ యాప్‌ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని మస్క్ ఆరోపించారు. యాప్ స్టోర్ విధివిధానాలు వాక్ స్వాతంత్ర్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 2 నుంచి యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్న బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం.
ట్విటర్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువభాగం యాపిల్ నుంచే వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం యాపిల్ అక్టోబరు 16 నుంచి 22 వరకు ప్రకటనల కోసం ట్విటర్లో 2,20,800 డాలర్లు వెచ్చించగా, నవంబరు 10 నుంచి నవంబరు 16 మధ్య కాలంలో ఈ మొత్తం 1,31,600 డాలర్లకు తగ్గించింది. మస్క్ ట్విటర్ బాధ్యతలు చేపట్టాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో యాపిల్ ప్రకటనల కోసం కేటాయిస్తున్న మొత్తాన్ని తగ్గిస్తూ వస్తోందని మార్కెటింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ యూజర్లకు ప్రధాన గేట్వేగా ఉన్న యాపిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మస్క్ ఆరోపిస్తున్నట్లు ట్విటర్‌ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే ఐఫోన్ యూజర్లు ట్విటర్‌కు దూరం కావాల్సిందే.
మస్క్ చేతిలో ట్విటర్ సురక్షితం కాదు!
ట్విటర్ పగ్గాలు మస్క్ చేపట్టిన తర్వాత యాప్‌లో డేటా భద్రత కొరవడిందని ట్విటర్ మాజీ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ యోయెల్ రోథ్ ఆరోపించారు. ప్రస్తుతం ట్విటర్ భద్రత గురించి పనిచేసేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. ‘‘గతంలో ట్విటర్లో పోస్ట్ అయ్యే కంటెంట్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ప్రస్తుతం దీనిపై ఎంత మంది పనిచేస్తున్నారో తెలియదు. ఉద్యోగుల రాజీనామాతో కంటెంట్ నియంత్రణ తగ్గిపోయింది’’ అని రోథ్ తెలిపారు. ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ విషయంలో ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం చేసిన హెచ్చరికలను మస్క్ లెక్కచేయలేదని రోథ్ ఆరోపించారు. అందువల్లే నకిలీ ఖాతాలు సైతం రుసుము చెల్లించి బ్లూ వెరిఫికేషన్ పొందగలిగాయని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు
-
India News
RVM: 2024 ఎన్నికల్లో ఆర్వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ
-
Movies News
Thalapathy 67: ఊహించని టైటిల్‌తో వచ్చిన విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబో
-
General News
Viveka murder case: సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
-
World News
Pakistan: పతనం అంచున పాక్.. 18 రోజులకే విదేశీ మారకపు నిల్వలు!
-
General News
Tarakaratna: తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు: లక్ష్మీనారాయణ