Twitter Blue: భారత్‌లో ట్విటర్‌ బ్లూ కోసం నెలకు రూ.900

Twitter Blue: ట్విటర్‌ బ్లూ పేరిట అందిస్తున్న అదనపు సేవల కోసం భారత్‌లో నెలకు రూ.900 చెల్లించాలని ట్విటర్‌ ప్రకటించింది.

Updated : 09 Feb 2023 14:05 IST

దిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ భారత్‌లో ట్విటర్‌ బ్లూ (Twitter Blue) ఛార్జీలను ప్రకటించింది. అదనపు ఫీచర్లతో వచ్చే ట్విటర్‌ బ్లూ (Twitter Blue) కోసం భారత యూజర్లు నెలకు రూ.900 చెల్లించాలని తెలిపింది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఒకే ఛార్జీని ప్రకటించింది. అదే వెబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌ యూజర్ల కోసం రూ.6,800ల ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను కూడా ప్రకటించింది.

ట్విటర్‌ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌ మస్క్‌ భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక సేవలను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారికి ట్వీట్లను తొలగించడం, ఎడిట్‌ చేయడం వంటి అదనపు ఫీచర్లు అందుతాయి. అలాగే అధిక నాణ్యతతో కూడిన సుదీర్ఘ వీడియోలను పోస్ట్‌ చేయొచ్చు. ప్రకటనలు సైతం భారీగా తగ్గుతాయి.

ఒకసారి ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న తర్వాత ప్రొఫైల్‌ ఫొటో, డిస్‌ప్లే నేమ్‌, యూజర్‌నేమ్‌ మార్చడం చేయొద్దని ట్విటర్‌ సూచించింది. అలా చేస్తే తిరిగి వాటిని ధ్రువీకరించే వరకు బ్లూ టిక్‌ మార్క్‌ను తొలగిస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని