
Twitter: ట్విటర్లో కొత్త నియామకాల నిలిపివేత.. ఇద్దరు ఉన్నతాధికారులకు ఉద్వాసన
కంపెనీ మస్క్ వశం కానున్న తరుణంలో పరాగ్ కీలక నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ సీఈఓ (CEO Of Twitter) పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) కంపెనీ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులను తొలగించారు. మరికొన్ని రోజుల్లో ట్విటర్.. ఎలాన్ మస్క్ (Elon Musk) వశం కానున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరాగ్ (Parag Agrawal) తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
వేటుకు గురైన వారిలో రీసెర్చి, డిజైన్, ఇంజినీరింగ్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఉన్న కీవాన్ బేక్పూర్, హెడ్ ఆఫ్ ప్రోడక్ట్స్ బ్రూస్ ఫాల్క్ ఉన్నారు. ఇరువురూ తమని కంపెనీ నుంచి తొలగించినట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం పితృత్వ సెలవుల్లో ఉన్న బేక్పూర్.. ‘‘నేను ఈ తరుణంలో, ఈ విధంగా ట్విటర్ (Twitter) నుంచి నిష్క్రమించాలనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు కొత్త నియామకాల (Hiring)ను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. కార్యకలాపాల నిర్వహణకు కచ్చితంగా అవసరమైన కీలక నియామకాలను తప్పించి మిగిలిన వాటిని చేపట్టడం లేదని కంపెనీ తెలిపింది. ఈవారం నుంచే నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించింది.
ఎలాన్ మస్క్ (Elon Musk) 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి వరకు ఈ ఒప్పందం అధికారికంగా పూర్తిగా కానుంది. అయితే, ప్రస్తుతం ట్విటర్ యాజమాన్యం, ఉద్యోగుల పనితీరుపై మస్క్ పలు సందర్భాల్లో సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులు తొలి నుంచీ తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
-
Ts-top-news News
Telangana News: సార్.. పిల్లిని రక్షించండి.. అర్ధరాత్రి సీపీకి ఫోన్
-
Ap-top-news News
Industrial property tax: పరిశ్రమల ఆస్తిపన్ను చెల్లింపులో 5% రాయితీ
-
Related-stories News
Srilanka Crisis: లంకలో అందరికీ వర్క్ ఫ్రం హోం
-
Ts-top-news News
CM KCR: నేడు రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్?
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఔరా... అనేల
- ఆవిష్కరణలకు అందలం
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- సన్నిహితులకే ‘కిక్కు!’
- Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్
- ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లకు మంగళం
- Rocketry: మాధవన్ ‘రాకెట్రీ’ని మెచ్చిన సీబీఐ అధికారులు