Elon Musk: ‘ట్విటర్ బతికే ఉంది’.. ‘రిప్‌ ట్విటర్‌’పై స్పందించిన మస్క్‌

రిప్‌ ట్విటర్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవ్వడంపై  ఎలాన్‌ మస్క్ స్పందించారు. ‘ట్విటర్ బతికే ఉంది’ అంటూ తాజాగా ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు కామెంట్లు గుప్పిస్తున్నారు.

Published : 20 Nov 2022 21:25 IST

దిల్లీ: ట్విటర్‌, ఎలాన్‌ మస్క్‌.. వార్తల్లో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేర్లివి.  ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు మస్క్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే అవుతోంది. వెరిఫైడ్‌ ఖాతా కోసం 8 డాలర్లు వసూలు చేయడం దగ్గర్నుంచి.. ఉద్యోగుల తగ్గింపు, దాదాపు 1200 మంది ఉద్యోగుల రాజీనామా ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఉద్యోగులంతా బిక్కుబిక్కుమంటున్నారు. మస్క్‌ తీసుకున్న నిర్ణయాలపై అటు యూజర్లు, ఇటు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో ఇటీవల రిప్‌ ట్విటర్‌ (RIP Twitter) హ్యాష్‌ట్యాగ్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయింది. త్వరలో ట్విటర్‌ మూతపడిపోతుందంటూ రకరకాల మీమ్స్‌ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మస్క్ స్పందించారు. ‘ట్విటర్‌ బతికే ఉందంటూ’ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన ఓ యూజర్‌.. ‘మునుపటిలా మరోసారి ఎగరగలదా’ అని ప్రశ్నించారు. మరొకరు ‘ మీరు ట్విటర్‌ను నాశనం చేశారు. మేమంతా వెళ్లిపోతాం’ అంటూ కామెంట్ చేశారు. ఇలా ఆయన ట్వీట్‌పై రకరకాల కామెంట్లు వస్తున్నాయ్‌.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని