Twitter Blue: రేపే ‘ట్విటర్ బ్లూ’ పునరుద్ధరణ.. ఐఫోన్ యూజర్లకు 11 డాలర్లు
గతంలో తీసుకొచ్చి నిలిపివేసిన ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవలను తిరిగి పునరుద్ధరించనున్నారు. సోమవారం నుంచి ఈ ప్రత్యేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈసారి ధరల్ని సవరించారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్ (Twitter) తమ ప్రీమియం సేవల్ని సోమవారం (డిసెంబరు 12) నుంచి తిరిగి ప్రారంభించనుంది. దీంతో ప్రత్యేక రుసుము చెల్లించిన వారు ‘బ్లూ చెక్‌మార్క్ (blue checkmark)’తో పాటు ప్రత్యేక ఫీచర్లతో కూడిన ‘ట్విటర్ బ్లూ (Twitter Blue)’ సేవల్ని పొందొచ్చు. గతంలో ‘బ్లూ టిక్’ కేవలం కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు మాత్రమే ఇచ్చేవారు. సదరు ఖాతాలను తనిఖీ చేసి వాటిని అధికారిక ఖాతాలుగా గుర్తించేవారు. ఇప్పుడు ఈ ప్రత్యేక గుర్తింపును రుసుము చెల్లించి ఎవరైనా పొందేందుకు వీలుంది.
వాస్తవానికి ‘ట్విటర్ బ్లూ (Twitter Blue)’ సేవల కోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ఫీజును చెల్లించే విధానాన్ని ట్విటర్ నెల క్రితమే తీసుకొచ్చింది. కానీ, నకిలీ ఖాతాల బెడద ఎక్కువవడంతో తాత్కాలికంగా నిలిపివేసింది. తగిన మార్పులు చేసి పునరుద్ధరిస్తామని తెలిపింది. తాజాగా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో సవరణలు చేయడం గమనార్హం. వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లుగా నిర్ణయించగా.. ఐఫోన్ యూజర్లకు 11 డాలర్లుగా నిర్దేశించారు. యాపిల్ తమ ప్లేస్టోర్ నుంచి యాప్‌లకు చేసే చెల్లింపులపై 30 శాతం రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ యూజర్లకు ట్విటర్ అధిక ఫీజును వసూలు చేయాలని నిర్ణయించినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kishan Reddy: తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్ రెడ్డి
-
Movies News
ss karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!
-
Movies News
Taman: ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియో పెట్టాలనుకుంటున్నా: సంగీత దర్శకుడు తమన్
-
Education News
JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డులు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!