Elon Musk: ‘ఆ ట్వీట్లను అనువదిస్తాం’.. మరో అప్‌డేట్ ఇచ్చిన మస్క్‌

ట్విటర్(Twitter) సీఈఓ ఎలాన్ మస్క్‌ తన సంస్థకు చెందిన మరో అప్‌డేట్ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. 

Published : 21 Jan 2023 10:57 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌(Twitter)ను సొంతం చేసుకున్న దగ్గరి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌మస్క్‌(Elon Musk) కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. శనివారం ఆయన కొత్త అప్‌డేట్ ఇచ్చారు.

‘రానున్న నెలల్లో ఇతర దేశాలు, సంస్కృతులకు చెందిన  ప్రజలు చేసే అద్భుతమైన ట్వీట్లను ట్విటర్‌ అనువదిస్తుంది. అలాగే వాటిని సిఫార్సు చేస్తుంది. ఇతర దేశాల్లో ప్రతిరోజూ ఎన్నో అమోఘమైన ట్వీట్లు ఉంటాయి. మరీ ముఖ్యంగా జపాన్‌ నుంచి..’ అంటూ ఆయన పోస్టు చేశారు. సిఫార్సు చేయడానికి ముందే వాటిని అనువదిస్తామని తెలిపారు.

మస్క్‌(Elon Musk) ట్విటర్‌(Twitter)ను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. అందులో బ్లూ టిక్‌ కూడా ఒకటి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల ఖాతాలకు వెరిఫై బ్లూ టిక్‌ ఇచ్చేవారు. ఎలాన్‌ మస్క్‌ ఎప్పుడైతే ట్విటర్‌ను సొంతం చేసుకున్నారో అప్పటి నుంచి అందులో మార్పులు చేపడుతూ వస్తున్నారు. తాజాగా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ (Twitter Blue) ఛార్జీలను ప్రకటించారు.

ఇటీవల కూడా ఆయన కొన్ని అప్‌డేట్లు ఇచ్చారు. ముఖ్యంగా రికమెండెడ్‌ vs ఫాలోడ్‌ ట్వీట్లను అటూఇటూ తేలికగా కదల్చడం, యూజర్‌ ఇంటర్ఫేస్‌లో మార్పులు, ట్వీట్‌ వివరాల కోసం బుక్‌ మార్క్‌ బటన్‌, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి సౌలభ్యం గురించి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని