Twitter: మస్క్‌ మరో ప్లాన్‌.. ట్విటర్‌లో పేమెంట్‌ సదుపాయం!

ట్విటర్‌లో పేమెంట్‌ సదుపాయం తీసుకొచ్చేందుకు ఎలాన్‌ మస్క్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లైసెన్స్‌ కోసం ఇప్పటికే ట్విటర్‌ దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

Published : 31 Jan 2023 18:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ (Twitter)లో మరో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk). ట్విటర్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో పేమెంట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. 

మస్క్‌ గతేడాది అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మస్క్‌ కొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విటర్‌ ఆర్థిక కష్టాలతో సతమతమవుతోంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో పేమెంట్‌ సదుపాయం తీసుకొచ్చే దిశగా మస్క్‌ అడుగులు వేస్తున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్, చెల్లింపులు, ఇ-కామర్స్ షాపింగ్‌లను అందించే ‘ఎవ్రీథింగ్‌’ యాప్‌గా ట్విటర్‌ను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు మస్క్‌ గతంలోనే తెలిపారు. అందులో భాగంగానే ఈ మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్విటర్‌ 2021లోనే ఫాలోవర్ల నుంచి డిజిటల్‌ రూపంలో టిప్స్‌ను తీసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని