Updated : 24 Jun 2022 19:08 IST

ద్విచ‌క్ర వాహ‌న రుణాల‌కు వివిధ బ్యాంకులు అందించే ఆఫర్లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి ద్విచ‌క్ర వాహ‌నాల సంఖ్య రోడ్ల‌పై పెరుగుతూనే ఉంది. న‌గ‌రాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ద్విచ‌క్ర వాహ‌నాలు న‌డిపేవారు గ‌ణ‌నీయంగా పెరిగారు. గ‌తంలో కేవలం పురుషులే ద్విచక్ర వాహనాలు నడిపేవారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే, విద్య‌న‌భ్య‌సించే మ‌హిళ‌లు, రోజువారీ ప‌నులకు వెళ్లే కూలీలు కూడా ద్విచక్ర వాహ‌నాల‌ను విరివిగా న‌డుపుతున్నారు. వేగంగా గమ్య‌స్థానానికి చేర‌డం కూడా ద్విచ‌క్ర వాహ‌నాలు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది. ఈ వాహ‌నాల‌కు బ్యాంకులు కూడా వేగంగానే రుణాలిస్తున్నాయి. వినియోగ‌దారులు బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండానే వాహ‌నాల షోరూమ్‌ల వ‌ద్దే త‌మ ప్ర‌తినిధుల‌ను పెట్టి అక్క‌డిక‌క్క‌డే రుణ సేవ‌లు అంద‌జేస్తున్నాయి.

ద్విచ‌క్ర వాహ‌నం సొంతం చేసుకోవాల‌నుకునే కోరిక ఉంటే చాలు రుణాలు మంజూరు చేసే రుణ సంస్థ‌లు అనేకం ఉన్నాయి. మోటారు వాహ‌నాల‌ కోసం ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థ‌ల ద్వారా వేగంగా రుణాలు మంజూరు అవుతున్నాయి. అయితే, రుణం తీసుకునేట‌ప్పుడు వ‌ర్తించే వ‌డ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఆల‌స్య చెల్లింపు రుసుములు, ప్రీ పేమెంట్ ఛార్జీలు, ప్రీ-క్లోజ‌ర్ ఛార్జీలు మొద‌లైన వాటి వివ‌రాలు బ్యాంకు బ్యాంకుకు ఎంతేసి ఉన్నాయో స‌రి చూసుకోవాలి. క్రెడిట్ స్కోర్ 750 అంత‌కంటే దాటి ఉన్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేటుకే వేగంగా రుణం మంజూరు అవుతుంది. వీరికి 7.25% వ‌డ్డీ రేటు నుంచి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 750 క‌న్నా త‌క్కువ ఉన్న వారికి కూడా రుణం మంజూర‌వుతుంది గానీ అధిక రుణ రేటు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది.

భాగ‌సామ్య ఒప్పందాలు: ద‌్విచ‌క్ర వాహ‌న రుణం పొంద‌డానికి మీకు రెండు ఎంపిక‌లు ఉన్నాయి. రుణం కోసం బ్యాంకును మీరే ఎంచుకోవ‌చ్చు లేదా ద్విచ‌క్ర వాహ‌న షోరూంల‌కు బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల‌తో ప్ర‌త్యేక ఒప్పందాలు ఉంటే వారితో క‌లిసి రుణ ఒప్పందాలు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ ప్రాసెసింగ్ రుసుముల‌ను మాఫీ చేసే బ్యాంకుల‌తో ద్విచ‌క్ర వాహ‌న కంపెనీలు భాగ‌స్వామ్య ఒప్పందాలు క‌లిగి ఉంటాయి. త్వ‌ర‌గా రుణాన్ని మంజూరు చేయ‌డ‌మే కాకుండా త‌క్కువ వ‌డ్డీ రేటును వ‌సూలు చేస్తాయి. వివిధ బ్యాంకుల రుణ వ‌డ్డీ రేట్లు స‌రిపోల్చుకుని నిర్ణ‌యం తీసుకోవాలి.

ద్విచ‌క్ర వాహ‌న రుణాల‌పై ప్ర‌త్యేక ఆఫ‌ర్‌లు: చాలా బ్యాంకులు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక ద్విచ‌క్ర వాహ‌న రుణ ఆఫ‌ర్‌ల‌ను అంద‌జేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు పండుగ‌లు, నూత‌న సంవ‌త్స‌రం, స్వాతంత్య్ర దినోత్స‌వం మొద‌లైన నిర్దిష్ట రోజులు, స‌మ‌యాల్లో మీరు మంచి ఆఫ‌ర్ల‌ను పొందొచ్చు. ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేటుతో, సున్నా ప్రాసెసింగ్ ఛార్జీల‌తో ద్విచ‌క్ర వాహ‌న రుణాన్ని తీసుకోవచ్చు. ఒక్కోసారి ఆర్థిక సంవత్సరం చివరిలో కూడా ఆఫర్లు అందించే అవకాశం ఉంటుంది.

ఫ్రీ-అప్రూవ్డ్ రుణ ఆఫ‌ర్‌లు: మీరు మీ బ్యాంకు ఖాతాలో మంచి లావాదేవీ రికార్డుని క‌లిగి ఉన్నా, మంచి ఆర్థిక సంబంధాన్ని క‌లిగి ఉన్నా కూడా మీ బ్యాంకు మీకు ముందుగా ఆమోదించిన ద్విచ‌క్ర వాహ‌న రుణాన్ని అందించ‌వ‌చ్చు. సాధార‌ణంగా ఇటువంటి రుణాల్లో మీరు రుణ మొత్తం, వ‌డ్డీ రేటు, ఛార్జీల గురించి ముంద‌స్తు స‌మాచారాన్ని పొందుతారు. ముంద‌స్తు ఆమోదం పొందిన రుణాలు త్వ‌ర‌గా ప్రాసెస్ చేస్తారు. ఇ-మెయిల్‌లు, ఎస్ఎంఎస్‌, ఫోన్ కాల్‌ల ద్వారా బ్యాంకులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ముంద‌స్తుగా ఆమోదించిన రుణాల గురించి తెలియ‌జేస్తాయి. మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వ‌డం ద్వారా కూడా వాటిని ప‌రిశీలించ‌వ‌చ్చు.

త‌క్కువ క్రెడిట్ స్కోరు ఉంటే: కొన్నిసార్లు, రుణ‌గ్ర‌హీత‌లు త‌క్కువ క్రెడిట్ స్కోరు ఉంటే వారికి బ్యాంకు అర్హ‌త ప్ర‌మాణాలు నెర‌వేర‌వు. అటువంటి సంద‌ర్భాల్లో వారు ద్విచ‌క్ర రుణం కోసం ఎన్‌బీఎఫ్‌సీని సంప్ర‌దించ‌వ‌చ్చు. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల అర్హ‌త నిబంధ‌న‌లు రుణ‌గ్ర‌హీత‌ల‌కు అనుకూలంగా ఉంటాయి. కానీ అవి అధిక వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ రుసుమును విధించ‌వ‌చ్చు. మీ వాస్త‌వ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ద్విచ‌క్ర వాహ‌న రుణాన్ని తీసుకోవ‌డం మంచిది. మీ ఆర్థిక ప్ర‌యాణాన్ని అవాంత‌రాలు లేకుండా కొన‌సాగించడానికి ఈఎంఐలు గ‌డువులోగా చెల్లించాలి.

ద్విచ‌క్ర వాహ‌నాల‌కు వివిధ బ్యాంకులు వ‌సూలు చేసే వ‌డ్డీ రేట్లు ఈ దిగువ ప‌ట్టిక‌లో ఉన్నాయి.

గ‌మ‌నిక: ఈ డేటా 2022 20 జూన్ నాటిది. ద్విచ‌క్ర వాహ‌నాల రుణాల‌పై బ్యాంకులు అందించే అత్య‌ల్ప వ‌డ్డీ రేటు, రుణ మొత్తం, కాల‌వ్య‌వ‌ధితో సంబంధం లేకుండా ఈ ప‌ట్టిక‌లో ఇచ్చాం. మీ క్రెడిట్ స్కోర్‌, చేసే వృత్తి, ఆర్జించే ఆదాయం, బ్యాంకు విధించే నియ‌మ, నిబంధ‌న‌ల‌ ఆధారంగా వ‌డ్డీ రేటులో మార్పులు ఉండొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని