Two wheeler loans: ద్విచ‌క్ర వాహ‌న రుణాల వ‌డ్డీ రేట్లు.. ఏ బ్యాంక్‌లో ఎంత?

ద్విచ‌క్ర వాహ‌న రుణాలు ఇపుడు 7% కంటే త‌క్కువ వ‌డ్డీరేటులో కూడా అందుబాటులో ఉంటున్నాయి.

Updated : 18 Apr 2022 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్ అనంత‌ర ప‌రిణామాలు ద్విచక్ర వాహన అవసరాన్ని తెలియజెప్పాయి. దీంతో ప్ర‌తి కుటుంబానికీ ఓ ద్విచక్రవాహనం అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ద్విచ‌క్ర వాహ‌న రుణాలు 7% కంటే త‌క్కువ వ‌డ్డీరేటులు అందుబాటులో ఉంటున్నాయి. వాహ‌న కొనుగోలుదారులు బ్యాంక్ మొబైల్ యాప్‌, వెబ్‌సైట్ ద్వారా లేదా బ్యాంకు శాఖ‌ను సంద‌ర్శించి రుణ దరఖాస్తును పూరించొచ్చు. వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణ చెల్లింపులు, ఇతర రుణ నిబంధ‌న‌లు వంటి అన్ని విష‌యాల‌ను రుణం తీసుకునే ముందే సరిచూసుకోవాలి. మీరు ప్ర‌తి నెలా ఎంత ఈఎంఐ చెల్లించ‌గ‌ల‌రో నిర్ధారించుకుని రుణాన్ని తీర్చే కాల‌వ్య‌వ‌ధిని ఎంపిక చేసుకోవాలి.

మీరు ఎప్పుడైనా మీ ద్విచ‌క్ర వాహ‌న రుణాన్ని ముంద‌స్తుగా బ‌కాయి మొత్తం చెల్లించి రుణ ఖాతాను మూసివేయాల‌ని భావిస్తే దానికి సంబంధించిన ఛార్జీల‌ను తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు దీనికి రుసుములు వ‌సూలు చేయ‌వ‌చ్చు. మీ రుణాన్ని ముంద‌స్తుగా తీర్చివేయ‌డం వ‌ల్ల వ‌డ్డీ ఆదా చేసుకోవ‌చ్చు. చాలా బ్యాంకులు వాహ‌నం విలువ‌లో 80% నుంచి 90% వ‌ర‌కు రుణాన్ని ఇస్తాయి. మిగ‌తా వాహ‌న ఖ‌ర్చులు సొంతంగా భ‌రించాలి. కొన్ని బ్యాంకులు అద‌న‌పు నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌తో 100% రుణాన్ని అందిస్తాయి.

వాహ‌న కొనుగోలుదారులు స‌మ‌యానికి ఈఎంఐ చెల్లించ‌క‌పోతే బ్యాంకు వాహ‌నాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఆ బైక్‌/స్కూట‌ర్ బ్యాంకు రుణంలో ఉన్నందున బ్యాంకు న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు వాహ‌నాన్ని జ‌ప్తు చేయడానికి బ్యాంకుకు పూర్తి హ‌క్కు ఉంటుంది. ఒకవేళ మీరు ద్విచ‌క్ర వాహ‌న రుణం తీసుకోవాల‌నుకుంటే ప్ర‌స్తుతం వివిధ బ్యాంకులు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ పొందుపరిచాం. రూ.75 వేల రుణానికి, 3 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి సంబంధించిన ఈఎంఐ వివరాలను అందించాం.

గ‌మ‌నిక: వ‌ర్తించే వ‌డ్డీ రేటు మీ వ‌య‌స్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్‌, రుణం తీసుకునే వారి అర్హ‌త అవ‌స‌రాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. పైన పేర్కొన్న ఈఎంఐలో ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇత‌ర ఫీజులు క‌ల‌ప‌లేదు. వడ్డీ రేట్లు ఎప్పుడైనా మారొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని