Mutual Fund SIP: ఎన్ని రకాలుగా ‘సిప్’ చేయవచ్చో తెలుసా?
మార్కెట్లో వివిధ రకాల సిప్‌లు అందుబాటులో ఉన్నాయి. మదుపర్లు వారి వారి లక్ష్యాలు, కాలవ్యవధి, పెట్టుబడుల సామర్థ్యం తదితర అంశాలకు అనుగుణంగా సరైన సిప్ ఎంచుకోవడం ప్రధానం.
ఇంటర్నెట్ డెస్క్: మదుపర్లు మ్యూచువల్ ఫండ్లలో ఏకమొత్తంగా (లంప్సమ్) గానీ, క్రమానుగత (సిప్) విధానంలో గానీ మదుపు చేయవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో ఉంటే ఏకమొత్తంగా పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ, ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారికి మాత్రం క్రమానుగత పెట్టుబడుల (సిప్) విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు ప్రారంభించి దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకునేందుకు సాయపడుతుంది. అలాగే మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా అన్ని మార్కెట్ సైకిల్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల సగటు ధరతో నష్టభయాన్ని తగ్గించుకొని మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల సిప్‌లు అందుబాటులో ఉన్నాయి. సంపదను కూడబెట్టాలనుకునే వారు.. వారి వారి లక్ష్యాలు, లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న కాలపరిమితి, పెట్టుబడుల సామర్థ్యం తదితర అంశాలకు అనుగుణంగా సరైన సిప్ ఎంచుకోవడం ప్రధానం. అందువల్ల ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల సిప్ల గురించి తెలుసుకుందాం.
రెగ్యులర్ సిప్..
సిప్‌లో ప్రాథమిక రకం. సరళంగా ఉంటుంది. మదుపర్లు నిర్ణీత వ్యవధి (ఫ్రీక్వెన్సీ)లో ముందుగానే నిర్ణయించిన మొత్తాన్ని మదుపు చేస్తారు. నిధుల సౌలభ్యతను అనుసరించి మదుపర్లు సిప్ ఫ్రీక్వెన్సీని నెలవారీ, ద్వైమాసికం, త్రైమాసికం, అర్ధ వార్షికం, వార్షిక ప్రాతిపదికన ఎంచుకోవచ్చు. రోజువారీ, వారపు సిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఎంచుకునేది.. ఆర్థిక నిపుణులు సూచించేదీ నెలవారి సిప్‌నే. మీరు ఎంచుకునే ఫ్రీక్వెన్సీ, కాలపరిమితి, సిప్ మొత్తంలను సిప్ ఎంచుకున్నప్పుడే పేర్కొనాలి. సాధారణ సిప్‌లో పెట్టుబడుల వ్యవధిలో పెట్టుబడి మొత్తాన్ని మార్చలేరు.
టాప్-అప్ సిప్..
దీన్నే స్టెప్-అప్ సిప్ అని కూడా అంటారు. మదుపర్లు తమ క్రమానుగత పెట్టుబడులను పెంచుకునేందుకు స్టెప్-అప్ సిప్ అనుమతిస్తుంది. అంటే, మదుపర్లు తమ ఆదాయం పెరిగినప్పుడల్లా సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి, తక్కువ జీతం ఉన్నప్పుడు తక్కువ మొత్తంతో సిప్ ప్రారంభించినా జీతం పెరిగినప్పుడు పెట్టుబడులను పెంచుకునేందుకు సాయపడుతుంది. దీంతో అధిక మొత్తాలను ఆదా చేయడంతో పాటు లక్ష్యం చేరుకునేందకు కావాల్సిన మొత్తాన్ని త్వరగా సమకూర్చుకోవచ్చు.
ఉదాహరణకు మీరు రూ.1000 వార్షిక స్టెప్-అప్ సిప్‌ను ఎంచుకుని నెలకు రూ. 10,000తో పెట్టుబడులు ప్రారంభించారునుకుందాం. 12 నెలల పాటు ఇదే మొత్తం సిప్ చేసినా 13వ నెల నుంచి రూ.11,000 సిప్ చేయాలి. ఆ తర్వాత 25వ నెల నుంచి రూ.12,000.. ఇలా ప్రతి సంవత్సరం పెట్టుబడులు మొత్తం పెరుగుతూ వస్తుంది. ఇందులో ప్రతి ఏడాదీ నిర్ణీత శాతం పెరిగేలా కూడా ఎంచుకోవచ్చు.
ఫ్లెక్సిబుల్ సిప్..
పేరులో సూచించినట్లుగానే సౌకర్యవంతంగా పెట్టుబడులు చేసే వీలుకల్పిస్తుంది. దీన్ని ఫ్లెక్సీ సిప్ లేదా ఫ్లెక్స్ సిప్ అని కూడా అంటారు. ఇందులో పెట్టుబడిదారులు తమ ఆర్థిక స్థితిగతులకు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టబడి మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక నెల అనుకోని ఖర్చులు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో నగదు కొరత ఏర్పడి పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. అలాంటి సమయంలో ఒకటి, రెండు నెలల సిప్‌ను నిలిపి వేయమని ఫండ్ హౌస్‌ను కోరవచ్చు. దీనివల్ల డిఫాల్ట్ లేకుండా సిప్‌ను దాటివేయవచ్చు. అదేవిధంగా పెట్టబడిదారుని వద్ద మిగులు మొత్తం ఉంటే సిప్ పెంచుకోవచ్చు.
అలాగే, మార్కెట్లు పడిపోయినప్పుడు ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడులు పెట్టి ఎక్కువ యూనిట్లు పొందవచ్చు. మార్కెట్లు హెచ్చులో ఉన్నప్పుడు సిప్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఫండ్హౌస్కి ఇచ్చే సూచనలను బట్టి సిప్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. సిప్ మొత్తాన్ని మార్చుకోవాలనుకుంటే సిప్ తేదీకి వారం లేదా రెండు వారాలు ముందుగా ఫండ్‌హౌస్‌కు వివరాలు తెలియజేయాలి.
శాశ్వత సిప్..
మదుపర్లు తమ సిప్‌ను ఎప్పటివరకు కొనసాగించాలో తెలియజేయకపోతే, అది శాశ్వత సిప్ అవుతుంది. ఎంత కాలం పాటు సిప్‌ను కొనసాగించాలో తెలియనప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. సిప్‌ను నిలిపివేయమని ఫండ్‌హౌస్ లేదా ఫండ్ మేనేజర్‌కు తెలియజేసే వరకు సిప్ కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఎప్పుడైనా సిప్ మొత్తాన్ని రీడీమ్ చేసుకోవచ్చు.
ట్రిగ్గర్ సిప్..
ఇది మార్కెట్ కదలికలపై పట్టు ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ రకమైన సిప్‌లో కొనుగోలు, అమ్మకపు స్థానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మదుపర్లు వారి సిప్ ప్రారంభ తేదీని సెట్ చేసుకోవచ్చు. ఎంచుకున్న ఈవెంట్‌కు చేరుకున్న తర్వాత రీడీమ్, స్విచ్ చేయవచ్చు.
ఉదాహరణకు మీ లక్ష్యం కోసం కావాల్సిన మొత్తాన్ని ఎంచుకున్న సమయం కంటే ముందుగానే చేరుకున్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్ స్థితి బాగుందనుకుంటే ట్రిగ్గర్ సిప్‌లో సిప్ మొత్తాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. లేదా మరొక ఫండ్‌కు స్విచ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో ట్రిగ్గర్ సిప్ సదుపాయం.. మదుపర్లు ట్రిగ్గర్ పాయింట్‌కు చేరుకున్నప్పుడు.. సమకూరిన మొత్తంలో కొంత భాగాన్ని గానీ, పూర్తిగా గానీ రీడీమ్ చేసుకోవడంలో సాయపడుతుంది.
బీమాతో సిప్..
మదుపరి దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకుంటే కొన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు బీమా రక్షణను అందిస్తాయి. బీమా ప్రారంభ కవరేజీ సాధారణంగా మొదటి సిప్ మొత్తానికి పది రెట్లు ఉంటుంది. కాలక్రమేణా పెరుగుతుంది. అయితే ఈ ఫీచర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. టర్మ్ బీమా యాడ్-ఆన్ ఫీచర్ మాత్రమేనని, ఫండ్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపదని మదుపర్లు గమనించాలి.
మల్టీ సిప్..
ఒకే సిప్ ద్వారా ఫండ్ హౌస్ అందించే వేరు వేరు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మల్టీ సిప్ అనుమతిస్తుంది. మదుపర్లు వారి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడంలో ఇది సాయపడుతుంది.
చివరిగా..
మ్యూచువల్ ఫండ్లలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడానికి సిప్ ఒక మంచి మార్గం. వ్యక్తులు వారి వారి లక్ష్యాలు, అవసరాలు, పెట్టుబడుల సామర్థ్యం, కాలపరిమితి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సిప్‌ను ప్రారంభించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం. -
Post office: ఈ పోస్టాఫీసు పథకంతో నెలకు ₹9 వేలు ఆదాయం
Monthly Income Scheme: ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చే పథకం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీసు పథకంపై లుక్కేయండి... -
Personal Finance: మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి?
జీవితంలో వివిధ దశలలో అవసరాలను తీర్చుకోగలిగే విధంగా ఆర్థిక ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇక్కడ చూడండి.. -
Insurance: బీమా సంస్థలందించే వివిధ పాలసీలు ఇవిగో..
నేడు మార్కెట్లో అనేక నష్టాలను కవర్ చేసే బీమా పథకాలు ఉన్నాయి. చాలా బీమా పాలసీలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బీమా సంస్థలు తీర్చిదిద్దాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఇక్కడ తెలుసుకోండి. -
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!
Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరినవారు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తప్పులను నివారించాలి. అవేంటో చూద్దాం..! -
ఆర్థిక స్వేచ్ఛ సాధించేద్దాం
భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. -
మ్యూచువల్ ఫండ్లు ఒకే రంగంలో మదుపు చేయాలంటే...
ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగమూ కీలక భూమిక పోషిస్తుంది. కొన్నిసార్లు కొన్ని రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి స్థానంలోకి కొత్తవి వస్తుంటాయి. భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తాయనుకునే రంగాల్లో మదుపు చేసి, లాభాలు ఆర్జించే వ్యూహంతో వచ్చినవే థీమ్యాటిక్ ఫండ్లు. -
ప్రభుత్వ హామీ పథకాల్లో
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ తరగతికి చెందిన ఒక ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ పథకాన్ని ఆవిష్కరించింది. ‘యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ జూన్ 2034 డెట్ ఇండెక్స్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 12న ముగుస్తుంది. -
పీపీఎఫ్, SSY కడుతున్నారా? కనీస మొత్తం జమ చేయడానికి డెడ్‌లైన్ ఇదే..!
పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటి ప్రభుత్వ పథకాల్లో మార్చి 31లోగా కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా