Uber: విద్యుత్తు వాహనాలతో ఉబర్‌ సేవలు

కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ విద్యుత్తు వాహనాలతో సేవల్ని ప్రారంభించింది.

Published : 21 Oct 2022 20:29 IST

దిల్లీ: క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ (Uber) తమ కస్టమర్లకు విద్యుత్తు వాహనాల (Electric Vehicles)తో సేవల్ని అందించడం ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టులో బాగంగా తొలుత దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని నడుపుతోంది. రానున్న రోజుల్లో ఈ సేవల్ని ఇతర నగరాలకూ విస్తరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కేవలం ముందు బుక్‌ చేసుకున్న ట్రిప్‌లకు మాత్రమే విద్యుత్తు కార్లతో సేవలందిస్తున్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఉబర్‌ (Uber) ఎన్ని విద్యుత్తు కార్లతో సేవల్ని ప్రారంభించిందన్నది తెలియరాలేదు. అయితే, ఈవీలను అందిస్తున్న కంపెనీలు, ఛార్జింగ్‌ వసతులు కల్పిస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఇటీవల ఓ సందర్భంలో ఉబర్‌ తెలిపింది. కర్బన ఉద్గారాల విషయంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తాము విద్యుత్తు వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. వచ్చే కొన్నేళ్లలో క్యాబ్‌ సేవల సంస్థలు పూర్తిగా విద్యుత్తు వాహనాలతో సర్వీసులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఉబర్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని