Uber: ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? కొత్తగా వచ్చిన ఫీచర్లివే..
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ భారత్‌లో కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ వీటిని తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (UBER) తన సేవలను మెరుగు పరుచుకోవడంలో భాగంగా భారత్‌లో కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ వీటిని తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. వెనుకవైపు కూర్చునేవారు సీటు బెల్టు ధరించాలని చెప్పడం, అత్యవసర కస్టమర్‌కేర్ సదుపాయం వంటివి ఇందులో ఉన్నాయి. తరచూ క్యాబుల్లో ప్రయాణించేవారు ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది.
ఉబర్‌లో ఇకపై ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకుంటే కారు ఎక్కగానే.. డ్రైవర్ ఫోన్ నుంచి ‘సీటు బెల్టు పెట్టుకోండి’ అనే సందేశం వినిపిస్తుంది. అదే సమయంలో ప్రయాణికుడి ఫోన్‌కు సైతం ఓ పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, లైవ్ లొకేషన్ సహా కీలక సమాచారాన్ని స్థానిక పోలీసులతో పంచుకునేందుకు SOS ఇంటిగ్రేషన్‌ను ఉబర్ ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని ప్రధాన నగరాల్లో ఈ సర్వీసును త్వరలో ప్రారంభించేందుకు స్థానిక పోలీసులతో చర్చలు జరుపుతోంది.
అలాగే, అత్యవసరంగా ప్రయాణికుడికి ఏదైనా అవసరం అయినప్పుడు కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు 24×7 సేఫ్టీలైన్ వ్యవస్థను ఉబర్ ప్రారంభించింది. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్ యాప్ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది. వీటితో పాటు 2019లో రైడ్‌చెక్ పేరిట తీసుకొచ్చిన ఫీచర్‌కు మరిన్ని మెరుగులు అద్దింది. నిర్దేశిత సమయానికంటే ఎక్కువ సమయం వాహనం ఆపితే అటు డ్రైవర్‌కు, ఇటు ప్రయాణికుడికి అంతా సవ్యంగానే ఉందా? అనే ప్రశ్నతో కూడిన నోటిఫికేషన్ వెళుతుంది. గమ్యస్థానం చేరేలోగా నిర్దేశిత రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్లినా, గమ్యస్థానం కంటే ముందే నిలిపేసినా ‘రైడ్‌చెక్’ ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. కొత్తగా నగరానికి వచ్చిన వారికి, రాత్రివేళ ప్రయాణించే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ayodhya: సాలగ్రామమై అవతరించిన శ్రీమహావిష్ణువు.. అయోధ్యకు చేరుకున్న వేళ..
-
Politics News
Pawan kalyan: ఫోన్ ట్యాపింగ్.. ప్రాణభయంతో వైకాపా ఎమ్మెల్యేలు: పవన్ కల్యాణ్
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు