
డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచిన ఉజ్జీవన్ బ్యాంకు
ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సాధారణ ఎఫ్డీలపై 7.1% వరకు వడ్డీ రేటును పెంచింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 75 బేసిస్ పాయింట్లు పెంచి 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కాలవ్యవధికి 6.75%; 990 రోజులకు, 35 బేసిస్ పాయింట్లు పెంచి 7.1% వడ్డీ రేటును అందిస్తుంది.
ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లను, 990 రోజులకు సంవత్సరానికి 7.45% వడ్డీ రేటుగా నిర్ణయించింది. ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్లపై పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లు ఇప్పుడు 7.95% వరకు వడ్డీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్లను పొందుతారు. వినియోగదారులు ఈ ప్లాన్ కింద కనీసం రూ. 15 లక్షల నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ప్లాటినా పథకంలో పాక్షిక, అకాల ఉపసంహరణ సౌకర్యం అందుబాటులో లేదు. ఒక సీనియర్ సిటిజన్ ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్లో 990 రోజుల పాటు రూ. 20,00,000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ. 24,75,572/- వరకు పొందవచ్చు.
సరికొత్త వడ్డీ రేట్లు మే 19, 2022 నుండి అమలు లోకి వస్తాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు `ఎన్ఆర్ఈ`, `ఎన్ఆర్ఓ` లకు కూడా వర్తిస్తుంది. ఈ వడ్డీ రేట్ల పెంపు వినియోగదారులకు వడ్డీపై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశ్యంతోనే పెంచినట్లు ఈ బ్యాంకు ప్రతినిధి తెలిపారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈ వడ్డీ రేట్ల పెంపుతో బ్యాంకింగ్ సెక్టార్లో ఇతర బ్యాంకుల కన్నా వడ్డీ రేట్లను ఆకర్షణీయంగా మార్చింది.
పాత వడ్డీ రేట్లు, సవరించిన కొత్త వడ్డీ రేట్లు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సీనియర్ సిటిజన్లు అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్లను పొందుతారు.
పట్టిక సూచించినట్లుగా 7.1% వడ్డీ రేటుతో 990 రోజులకు రూ. 1,00,000 పెట్టుబడి పెట్టిన వ్యక్తి మెచ్యూరిటీ సమయంలో రూ. 1,21,011/- వరకు పొందవచ్చు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నెలవారీ, త్రైమాసిక, మెచ్యూరిటీ వడ్డీ చెల్లింపు ఎంపికలను కూడా అనుమతిస్తుంది.
పైన పేర్కొన్న వడ్డీ రేట్లు 'ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ల'పై కూడా వర్తిస్తాయి. అయితే, వారు 5 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటారు. అంతేకాకుండా బ్యాంకింగ్ సెక్టార్లో డిపాజిట్లకు రూ. 5 లక్షల వరకే బీమా ఉంటుంది. చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ వేసేవారు ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్