డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఉజ్జీవ‌న్ బ్యాంకు

ఈ బ్యాంకు మే 19, 2022 నుండి త‌మ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది.

Updated : 24 Nov 2022 15:15 IST

ప్ర‌ముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సాధార‌ణ ఎఫ్‌డీల‌పై 7.1% వ‌ర‌కు వ‌డ్డీ రేటును పెంచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేటు 75 బేసిస్ పాయింట్లు పెంచి 15 నెల‌ల ఒక రోజు నుండి 18 నెల‌ల కాల‌వ్య‌వ‌ధికి 6.75%; 990 రోజుల‌కు, 35 బేసిస్ పాయింట్లు పెంచి 7.1% వ‌డ్డీ రేటును అందిస్తుంది.

ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వ‌డ్డీ రేట్ల‌ను, 990 రోజుల‌కు సంవ‌త్స‌రానికి 7.45% వ‌డ్డీ రేటుగా నిర్ణ‌యించింది. ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై పెట్టుబ‌డి పెట్టే సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇప్పుడు 7.95% వ‌ర‌కు వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్లు అన్ని కాల వ్య‌వ‌ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను పొందుతారు. వినియోగ‌దారులు ఈ ప్లాన్ కింద క‌నీసం రూ. 15 ల‌క్ష‌ల నుండి రూ. 2 కోట్ల కంటే త‌క్కువ పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ప్లాటినా ప‌థ‌కంలో పాక్షిక, అకాల ఉప‌సంహ‌ర‌ణ సౌక‌ర్యం అందుబాటులో లేదు. ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 990 రోజుల పాటు రూ. 20,00,000 పెట్టుబ‌డి పెడితే మెచ్యూరిటీ స‌మ‌యంలో రూ. 24,75,572/- వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

సరికొత్త వ‌డ్డీ రేట్లు మే 19, 2022 నుండి అమలు లోకి వస్తాయి. రూ. 2 కోట్ల కంటే త‌క్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్లు `ఎన్ఆర్ఈ`, `ఎన్ఆర్ఓ` ల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఈ వ‌డ్డీ రేట్ల పెంపు వినియోగ‌దారులకు వ‌డ్డీపై ఆస‌క్తిని పెంచాల‌నే ఉద్దేశ్యంతోనే పెంచిన‌ట్లు ఈ బ్యాంకు ప్ర‌తినిధి తెలిపారు. ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈ వ‌డ్డీ రేట్ల పెంపుతో బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇత‌ర బ్యాంకుల క‌న్నా వ‌డ్డీ రేట్ల‌ను ఆక‌ర్ష‌ణీయంగా మార్చింది.

పాత వ‌డ్డీ రేట్లు, స‌వ‌రించిన కొత్త వ‌డ్డీ రేట్లు ఈ క్రింది ప‌ట్టిక‌లో ఉన్నాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్లు అన్ని కాల వ్య‌వ‌ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అద‌నంగా 50 బేసిస్ పాయింట్ల‌ను పొందుతారు.

ప‌ట్టిక సూచించిన‌ట్లుగా 7.1% వ‌డ్డీ రేటుతో 990 రోజుల‌కు రూ. 1,00,000 పెట్టుబ‌డి పెట్టిన వ్య‌క్తి మెచ్యూరిటీ స‌మ‌యంలో రూ. 1,21,011/- వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నెల‌వారీ, త్రైమాసిక‌, మెచ్యూరిటీ వ‌డ్డీ చెల్లింపు ఎంపిక‌ల‌ను కూడా అనుమ‌తిస్తుంది.

పైన పేర్కొన్న వ‌డ్డీ రేట్లు 'ట్యాక్స్ సేవ‌ర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌'పై కూడా వ‌ర్తిస్తాయి. అయితే, వారు 5 ఏళ్ల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధిని క‌లిగి ఉంటారు. అంతేకాకుండా బ్యాంకింగ్ సెక్టార్‌లో డిపాజిట్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కే బీమా ఉంటుంది. చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ వేసేవారు ఈ ముఖ్య‌మైన విష‌యాన్ని గ‌మ‌నించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని