FD Rates: వ‌డ్డీ రేట్లు పెంచిన ఉజ్జీవ‌న్ బ్యాంకు

సీనియ‌ర్ సిటిజ‌న్లు అన్ని కాల వ్య‌వ‌ధుల‌కి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 8.25% వ‌డ్డీని పొందుతారు.

Updated : 18 Aug 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు త‌మ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. 75 వారాలు, 75 నెల‌లు, 990 రోజులు ఈ 3 కాల వ్య‌వ‌ధుల డిపాజిట్ల‌పై 7.50% ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేటును ప్రకటించింది. సీనియ‌ర్ సిటిజ‌న్లు అన్ని కాల వ్య‌వ‌ధుల‌ ఎఫ్‌డీలపై అద‌నంగా 75 బేసిస్ పాయింట్ల‌ను పొందొచ్చు.

ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నెల‌వారీ, త్రైమాసిక‌, మెచ్యూరిటీ వ‌డ్డీ చెల్లింపు ఎంపిక‌ల‌ను అందిస్తోంది. పైన పేర్కొన్న వ‌డ్డీ రేట్లు ట్యాక్స్ సేవ‌ర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు కూడా వ‌ర్తిస్తాయి. దీనికి 5 ఏళ్ల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి ఉంటుంది. రూ. 2 కోట్ల కంటే త‌క్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్లు ఎన్ఆర్ఐల‌కు కూడా వ‌ర్తిస్తాయి.

పాత వ‌డ్డీ రేట్లు, స‌వ‌రించిన కొత్త వ‌డ్డీ రేట్లు ఈ కింది ప‌ట్టిక‌లో ఉన్నాయి:

ప‌ట్టిక‌లో పేర్కొన్న‌ట్టుగా 7.50% వ‌డ్డీ చొప్పున 75 వారాల‌పాటు రూ. 1,00,000 పెట్టుబ‌డి పెట్టిన వ్య‌క్తి మెచ్యూరిటీ స‌మ‌యంలో రూ.1,11,282 వ‌ర‌కు పొందొచ్చు. అదే విధంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు లక్ష రూపాయల పెట్టుబ‌డిపై 75 వారాల పాటు డిపాజిట్ చేస్తే 8.25% వ‌డ్డీ చొప్పున మెచ్యూరిటీ స‌మ‌యంలో రూ. 1,12,466 వ‌ర‌కు పొందొచ్చు.

బ్యాంకు ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను సంవ‌త్స‌రానికి 7.70%కి పెంచింది. 990 రోజుల కాల వ్య‌వ‌ధికి, సాధార‌ణ డిపాజిట్ కంటే 20 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటు పొందొచ్చు. ఖాతాదారులు ఈ ప్లాన్ కింద క‌నీసం రూ. 15 ల‌క్ష‌ల నుంచి రూ.2 కోట్ల లోపు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాన్ని కాల వ్య‌వ‌ధి మ‌ధ్య‌లో పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ ఉప‌సంహ‌రించుకోవ‌డానికి వీలుండ‌దు.

గ‌మ‌నిక: డిపాజిట్ల‌కు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కే బీమా ఉంటుంది. చిన్న బ్యాంకుల్లో  రూ.5 ల‌క్ష‌లు దాటి డిపాజిట్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఈ ముఖ్య‌మైన విష‌యాన్ని డిపాజిట్ చేసేవారు గ‌మ‌నించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని