Unacademy: మరో 10% ఉద్యోగుల్ని తొలగించిన అన్‌అకాడెమీ

Unacademy: వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీ నుంచి మరో 10 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అన్‌అకాడెమీ సీఈఓ గౌరవ్‌ ముంజల్‌ తెలిపారు.

Published : 08 Nov 2022 12:34 IST

దిల్లీ: ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ అన్‌అకాడెమీ మరో 350 మంది ఉద్యోగుల్ని తొలగించనుంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 10 శాతానికి సమానం. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ గౌరవ్‌ ముంజల్‌ తెలిపారు. ఇది కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ.. తప్పడం లేదని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు.

తొలగించిన ఉద్యోగులకు నోటీసు పీరియడ్‌తో పాటు అదనంగా రెండు నెలలకు సమానమైన వేతనాన్ని ఇవ్వనున్నట్లు ముంజల్‌ తెలిపారు. అలాగే అదనంగా ఒక ఏడాదికి ఆరోగ్య బీమా కవరేజీని కొనసాగిస్తామన్నారు. మరో ఉద్యోగం పొందడానికి కావాల్సిన మద్దతు కూడా ఇస్తామన్నారు. పెట్టుబడులు పూర్తిగా నెమ్మదించాయని.. ఆన్‌లైన్‌ కార్యకలాపాలు సైతం తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. గత ఏప్రిల్‌లోనే అన్‌అకాడెమీ 1,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని