Unacademy Layoffs: అన్‌అకాడమీలో మరో 12% ఉద్యోగుల తొలగింపు

Unacademy Layoffs: వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా అన్‌అకాడమీ మరో 380 మంది ఉద్యోగులను తొలగించింది. గత ఏడాది వ్యవధిలో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది నాలుగోసారి.

Published : 30 Mar 2023 22:08 IST

దిల్లీ: సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులున్న ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరో 380 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 12 శాతానికి సమానం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

2021లో భారీగా పెట్టుబడులను ఆకర్షించిన విద్యాసాంకేతిక రంగానికి.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, నిధుల రాక నెమ్మదించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల సిబ్బంది వ్యయాలను తగ్గించుకోవాలని అన్‌అకాడమీ (Unacademy) నిర్ణయించుకుందని సమాచారం. కంపెనీ లాభదాయకత దిశగా పయనించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈఓ గౌరవ్‌ ముంజల్‌ తెలిపారు. అయినప్పటికీ.. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని పేర్కొన్నారు. 12 శాతం సిబ్బంది తగ్గించాలని నిర్ణయించామన్నారు.

అన్‌అకాడమీ (Unacademy) ఇలా ఉద్యోగులను తొలగించడం ఏడాది వ్యవధిలో ఇది నాలుగోసారి. చివరిసారి గత ఏడాది నవంబరులో 350 మందిని తొలగించింది. అంతుకుముందు ఏప్రిల్‌లో 600 మందిని లేఆఫ్ చేసింది. మరోవైపు అనుబంధంగా పనిచేస్తున్న కోడ్‌చెఫ్‌ సంస్థను పూర్తిగా తమ వ్యాపారం నుంచి వేరు చేసింది. ప్రస్తుతం కోడ్‌చెఫ్‌ పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తోంది. అయితే, దాంట్లో అన్‌అకాడమీకి ఉన్న 30 శాతం వాటా మాత్రం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని