యునిఫైడ్ స్టాంప్ డ్యూటీతో ఎవ‌రికి లాభం?

స్టాక్స్ విక్రయించే పెట్టుబడిదారులు స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు.......

Published : 21 Dec 2020 16:17 IST

స్టాక్స్ విక్రయించే పెట్టుబడిదారులు స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు

20 డిసెంబర్ 2019 మధ్యాహ్నం 12:38

మ‌ద్యంత‌ర బ‌డ్జెట్ ఫిబ్ర‌వ‌రి 2019 లో చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం యునిఫైడ్ స్టాంప్ డ్యూటీని అమ‌లుచేసేందుకు ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 10 న గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 9, 2020 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. స్టాక్ ఎక్స్‌ఛేంజీల లావాదేవీల‌తో పాటు ఇత‌ర లావాదేవీల‌కు ఒకేర‌క‌మైన యునిఫైడ్ స్టాంప్ డ్యూటీల‌ను వ‌సూలు చేయ‌నుంది.

స్టాంప్ డ్యూటీ అంటే … ఇండియ‌న్ స్టాంప్ యాక్ట్,1899 లోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం రాష్ర్టాలు వ‌సూలు చేసే ప‌న్నుల వంటివి. చేసే లావాదేవీల ఆధారంగా స్టాంప్ డ్యూటీ ఉంటుంది. డాక్యుమెంట్లు, కాంట్రాక్టులు, ఆస్తులు, లావాదేవీల విలువ‌, కాల‌ప‌రిమితి, జెండ‌ర్ వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. స్థిరాస్తి లావాదేవీల‌పై స్టాంప్ డ్యూటీ సెక్యూరిటీల ట్రాన్స్‌ఫ‌ర్ చేసేట‌ప్పుడు వ‌ర్తించే స్టాంప్ డ్యూటీకి భిన్నంగా ఉంటుంది.

ఆర్థిక సెక్యూరిటీల లావాదేవీలన్నింటికీ ఒకటే స్టాంప్‌ డ్యూటీ రేటు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మధ్యంతర బడ్జెట్‌ అనంతరం ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన 2019-20 ద్రవ్యబిల్లులో భాగంగా ఈ ప్రతిపాదన చేశారు. ఆర్థిక సెక్యూరిటీల లావాదేవీలపై విధించే, వసూలు చేసే స్టాంప్‌ డ్యూటీకి సంబంధించి సంస్కరణలు తీసుకొని వస్తామని గతంలె ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు తగ్గట్లుగా ఇండియన్‌ స్టాంప్‌ డ్యూటీలో సవరణలు చేశారు. ప్రతిపాదిత సవరణలు లావాదేవీలపై స్టాంప్‌ డ్యూటీ విధింపు, వసూలు ప్రక్రియను సులభతరం చేస్తాయని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకటే స్టాంప్‌ డ్యూటీ ఉంచాలని ప్రతిపాదించడం వల్ల వ్యవస్థాగత, విధానపరమైన చిక్కులు తొలుగుతాయని భావిస్తున్నారు.

స్టాంప్ డ్యూటీలో వ‌చ్చిన మార్పులు
జ‌న‌వ‌రి 9 నుంచి స్టాక్ ఎక్స్‌ఛేంజీల మాదిరిగా ఇత‌ర లావాదేవీల‌కు కూడా స్టాంప్ డ్యూటీలు వ‌ర్తిస్తాయి. వారసత్వ సమయంలో వాటాల బదిలీ, జాబితా చేయని సెక్యూరిటీలలో బహుమతులు, లావాదేవీలు మొదలైనవి ఉన్నాయి. డీమ్యాట్ ఖాతాలలో చేసిన ఆఫ్-మార్కెట్ బదిలీలపై స్టాంప్ డ్యూటీని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఆ మేరకు ఇది ఖర్చును పెంచుతుంది ”అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

stamp duty.jpg​​​​​​​

రాష్ర్టాల వారిగా మార్పు
ఇంత‌కు ముందు స్టాంప్ డ్యూటీ రాష్ర్టాల‌కు అనుగుణంగా వేర్వేరుగా ఉండేది. అయితే ఇప్పుడు అన్ని రాష్ర్టాలు ఒకే ర‌క‌మైన డ్యూటీ రావ‌డంతో కొన్ని రాష్ర్టాల్లో ఇది త‌గ్గ‌వ‌చ్చు. మ‌రికొన్ని రాష్ర్టాల్లో పెర‌గ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌హారాష్ర్ట‌లో కోటి రూపాల‌య‌కు స్టాంప్ డ్యూటీ ఇప్పుడు రూ.1000 ఉండ‌గా, త‌ర్వాత రూ.1500 కి పెరుగుతంది. నాన్-డెలివ‌రీ (ఇంట్రాడే) ట్రేడింగ్‌కు రూ.200 నుంచి రూ.300 కి పెరుగుతుంది.

ప్ర‌యోజ‌నాలు

  • మొద‌ట‌గా చెప్పుకోవాల్సిన ప్ర‌యోజ‌నం ఏంటంటే స్టాక్ లావాదేవీల‌కు అంద‌రూ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. పెట్టుబడుదారులు స్టాక్‌ల‌ను అమ్మేట‌ప్పుడు స్టాంప్ డ్యూటీ చెల్లించ‌న‌వ‌స‌రంలేదు. కేవ‌లం కొనుగోలు చేసేవారు మాత్ర‌మే చెల్లించాలి. గతంలో ఇద్ద‌రూ చెల్లించాల్సి ఉండేది.
  • కరెన్సీ, వడ్డీ రేటు డివిడెండ్‌ల‌ కోసం స్టాంప్ డ్యూటీ రేటును కోటి రూపాయ‌ల‌కు రూ.200 నుంచి రూ.10 కి త‌గ్గించారు. "ఇది గణనీయమైన తగ్గింపు. మొత్తం మీద పెట్టుబడిదారులకు, ట్రేడ‌ర్ల‌కు ప్రయోజనం చేకూరుతుంది. కరెన్సీ విభాగంలో పెట్టుబడిదారులు తక్కువ రేట్ల ప్రయోజనం పొందుతారు. ఇంకా, ఈక్విటీ డెలివరీ ట్రేడ్ల విషయంలో అమ్మ‌కందారుల‌కు భారీ ఉపశమనం లభించింది.
  • ఏకీకృత రేటుతో లావాదేవీల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది
  • ఇది బ్రోకర్లకు స్టాంప్ డ్యూటీ వర్తింపు విధానాన్ని సులభతరం చేస్తుంది. ముందు బ్రోకర్లు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను అనుస‌రించి స్టాంప్ డ్యూటీని సేకరించి చెల్లించాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు లావాదేవీలు జరిగే ఎక్స్ఛేంజీలు ఆ పనిని చేస్తాయి. దీంతో కార్యాచరణ భారం, బ్రోకరేజ్ సంస్థలకు ఖర్చు త‌గ్గుతుంది.
  • బ్రోకరేజ్ సంస్థలే కాకుండా, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు, ట్రేడ‌ర్లు ఏకీకృత రేటుతో లాభం పొందే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని