MCLRను పెంచిన యూనియన్‌ బ్యాంక్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహ రుణం, ఇతర రుణ వడ్డీ రేట్లను పెంచింది.

Published : 12 Dec 2022 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూనియన్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా అన్ని రుణ కాలవ్యవధులకు తన MCLRను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం.. సవరించిన వడ్డీ రేట్లు 2022  డిసెంబరు 11 నుంచి 2023 జనవరి 10 వరకు అమల్లో ఉంటాయి. బ్యాంకు ఒక సంవత్సరం MCLR 8.25 శాతం ఉంది. దీంతో ప్రస్తుత రుణ గ్రహీతలు (గృహ రుణాలు వంటి) ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్నట్లయితే వారి ఈఎంఐలు పెరుగుతాయి. మే 2022 నుంచి సెంట్రల్‌ బ్యాంకు తన కీలక పాలసీ రేట్లను పెంచుతోంది. బ్యాంకు రెపోరేటు, ఇతర ముఖ్యమైన పాలసీ రేట్లను 2.25 శాతం పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు