ఎన్నికల రాష్ట్రాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం

కేరళ, అసోం, బంగాల్‌, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated : 01 Feb 2021 12:37 IST

దిల్లీ: కేరళ, అసోం, బంగాల్‌, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో   నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసోం, కేరళ, బంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బంగాల్‌లో రూ.25వేల కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000 కోట్లు, కేరళలో రూ.65వేల కోట్లతో  జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు కానుంది. 
 

ఇవీ చదవండి...
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని