Budget 2023: పేపర్‌లెస్‌ బడ్జెట్‌ కోసం ప్రత్యేక యాప్‌.. ఫీచర్లివే..! ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అందులోని సమాచారం సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కేంద్రం ప్రత్యేకంగా యూనియన్‌ బడ్జెట్‌ అనే వెబ్‌సైట్‌, యాప్‌ను తీసుకొచ్చింది.

Updated : 30 Jan 2023 17:48 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న బడ్జెట్‌ 2023-24 (Budget 2023)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. గత రెండు విడతల్లో మాదిరే ఈ సారి కూడా పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్‌ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు. పార్లమెంట్‌లో మంత్రి బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా అందులోని సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేందుకు యూనియన్‌ బడ్జెట్‌ (Union Budget) అనే వెబ్‌సైట్‌తోపాటు, యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. మరి, ఈ యాప్‌ ద్వారా బడ్జెట్‌ ప్రతులను ఎలా చూడొచ్చు? అందులో ఏయే వివరాలు ఉంటాయనేది చూద్దాం.

  • ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత యాప్‌లో బడ్జెట్‌ పీడీఎఫ్‌ ప్రతులు విడుదల చేస్తారు. వాటితోపాటు మంత్రి పూర్తి బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (DG), ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ యాప్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ యాప్‌లో బడ్జెట్‌ హైలైట్స్ పేరుతో సెక్షన్‌ ఉంటుంది. ఇందులో మంత్రి బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా అందులోని ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రసంగానికి సంబంధిన పూర్తి డాక్యుమెంట్లను సైతం ఇందులో అందుబాటులో ఉంటాయి. 

ఎవరు డిజైన్‌ చేశారు? 

డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) సూచనలతో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (NIC) బడ్జెట్‌ యాప్‌ను డిజైన్‌ చేసింది. ఆరోగ్యసేతు (Arogya Setu), ఈకోర్ట్‌ సర్వీసెస్‌ (eCourt Services), మైగవర్నమెంట్(MYGOV) వంటి యాప్‌లను ఎన్‌ఐసీ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఓఎస్‌లకు అనుగుణంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దింది. 

యాప్‌ డౌన్‌లోడ్‌ ఎలా ? 

యూనియన్‌ బడ్జెట్‌ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు అది ఎన్‌ఐసీ రూపొందించి యాప్‌ అవునా? కాదా? అనేది తప్పనిసరిగా సరిచూసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని